
న్యూస్ డెస్క్: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తాజా ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. లండన్‌లో ఓ అభిమానితో దిగిన ఈ ఫొటోలో, కోహ్లీ పూర్తి నెరిసిన గడ్డంతో కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.
ఈ కొత్త లుక్‌లో కోహ్లీని చూసి అభిమానులు గుర్తుపట్టలేకపోయామని కామెంట్లు చేస్తున్నారు.
ఈ ఫొటో బయటకురాగానే సోషల్ మీడియాలో వన్డే క్రికెట్ నుంచి కూడా కోహ్లీ రిటైర్మెంట్ తీసుకోబోతున్నారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇప్పటికే టెస్ట్‌లకు వీడ్కోలు పలికిన కోహ్లీ, వన్డేలకు కూడా గుడ్‌బై చెప్పే ఆలోచనలో ఉన్నారా అనే సందేహాలు మళ్లీ మొదలయ్యాయి.
“వన్డే రిటైర్మెంట్ లోడింగ్?” అంటూ మీమ్స్, పోస్టులు తెగ వైరల్ అవుతున్నాయి. తన గడ్డం రంగు గురించి గతంలో కోహ్లీ చేసిన సరదా వ్యాఖ్యలను ఇప్పుడు ఫ్యాన్స్ సీరియస్‌గా తీసుకుంటున్నారు.
శారీరకంగా కోహ్లీ ఫిట్‌గా ఉన్నప్పటికీ, గడ్డం మారిన కొత్త లుక్ వల్ల ఆయన భవిష్యత్తుపై అభిమానుల్లో సందేహాలు నెలకొన్నాయి. ఇప్పటివరకు కోహ్లీ వన్డే రిటైర్మెంట్ పై ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు.
ప్రస్తుతం క్రికెట్ అభిమానులు, కోహ్లీ అభిమానులు ఆయన తదుపరి నిర్ణయం కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.