న్యూస్ డెస్క్: అమెరికా, భారత్ మధ్య తాజా వాణిజ్య వివాదాల నేపథ్యంలో పాకిస్థాన్ తనకు అనుకూలమైన మార్గాలను అన్వేషిస్తోంది. ట్రంప్ ప్రభుత్వం భారత్‌పై విధించిన అదనపు సుంకాల వల్ల రెండు దేశాల సంబంధాల్లో కొంతంత గ్యాప్ ఏర్పడింది.
తమ దేశ ప్రయోజనాలే కీలకం అనే భారత్ స్పందన, ట్రంప్ తీరు పట్ల సొంత పార్టీ నేతలే విమర్శలు చేయడం గమనార్హం.
రష్యా నుంచి ముడి చమురును దిగుమతి చేసుకున్నందుకు భారత్‌పై ట్రంప్ 50 శాతం సుంకాన్ని విధించారు. ఇదే సమయంలో పాకిస్థాన్‌కు మాత్రం స్వల్ప సుంకాలు మాత్రమే అమలయ్యాయి. దీంతో పాకిస్థాన్ తనకు ఈ గ్యాప్ ను అనుకూలంగా మలచుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది.
ఇందులో భాగంగా, పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ ఇటీవలే అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ వైట్ హౌస్‌లో గౌరవప్రదమైన ఆహ్వానం పొందారు. ఇప్పుడు మునీర్ మరోసారి అమెరికా పర్యటనకు సన్నద్ధమవుతున్నారు. ఇది పాకిస్థాన్ అమెరికా బంధాన్ని మరింత బలోపేతం చేయడానికి దోహదపడనుంది.
ఇక అమెరికా భారత్ మధ్య పెరుగుతున్న దూరాన్ని చూసి పాక్ తన వ్యూహాలను వేగంగా అమలు చేస్తోంది. భారత్‌కు వ్యతిరేకంగా మరిన్ని అవకాశాలను వెతుక్కుంటోంది.
