
ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ చిత్రం డ్రాగన్పై రోజుకో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వెలుగులోకి వస్తోంది. తాజాగా, రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ భారీ సెట్ వేస్తున్నట్లు సమాచారం. దీనిలో ఓ స్పెషల్ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కించబోతున్నారట.
ఈ సీన్‌లో ఎన్టీఆర్‌తో పాటు ముఖ్యమైన పాత్రలు కూడా పాల్గొంటాయని, యాక్షన్ విజువల్స్ చాలా వైల్డ్‌గా ఉండబోతున్నాయట. ఎన్టీఆర్ గెటప్, సెటప్ ఈ సీన్‌లో ప్రేక్షకులకు థ్రిల్ కలిగించేదిగా ఉంటుందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ సినిమాను ప్రశాంత్ నీల్ తన కెరీర్‌లో బెస్ట్ సినిమాగా మలచాలనే దిశగా పని చేస్తున్నాడు. అందుకే స్క్రిప్ట్‌కు ఎక్కువ సమయం కేటాయించినట్టు తెలుస్తోంది. దీంతో అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి.
మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంగీతాన్ని కేజీఎఫ్ ఫేం రవి బస్రూర్ అందిస్తున్నాడు. ఇప్పటికే బీజీఎంలకు సంబంధించి కొన్ని టెస్ట్ ట్రాక్స్ కూడా రెడీ చేసినట్టు సమాచారం.
