Friday, September 4, 2026
HomeTelanganaహైదరాబాద్‌ కు మరోసారి భారీ వర్ష హెచ్చరిక

హైదరాబాద్‌ కు మరోసారి భారీ వర్ష హెచ్చరిక

hyderabad-rains-heavy-rain-alert-issued-for-hyderabad

న్యూస్ డెస్క్: గురువారం రాత్రి కురిసిన కుండపోత వానతో హైదరాబాద్ నగరం అస్తవ్యస్తంగా మారింది. ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాల్లో ఇంటి లోపలికి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

అయితే ఆ వర్ష ప్రభావం తేలిపోకముందే, మరోసారి భారీ వర్షానికి నగర ప్రజలు సిద్దమవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.

వాతావరణ శాఖ ప్రకారం, మరికొన్ని గంటల్లో నగరంపై మళ్లీ భారీ వర్షం పడే అవకాశం ఉందని హెచ్చరించింది. జీహెచ్ఎంసీ, హైడ్రా రెస్క్యూ బృందాలు అప్రమత్తమయ్యాయి. అత్యవసర అవసరం తప్ప ఇంటి బయటకు రావద్దని అధికారుల సూచనలు వెలువడాయి.

గచ్చిబౌలి, సరూర్‌నగర్, శ్రీనగర్ కాలనీల్లో గత రాత్రి భారీ వర్షపాతం నమోదైంది. అదే తరహా వర్షం మరోసారి కురిస్తే, మళ్లీ ఆ ప్రాంతాలు జలమయం అయ్యే ప్రమాదం ఉంది. విద్యుత్ సరఫరా కూడా అంతరాయం కలగవచ్చని హెచ్చరించారు.

ప్రజలు వాహనాలను సురక్షితమైన ప్రదేశాల్లో పార్క్ చేయాలని, పిల్లలు, వృద్ధులు ఇంట్లోనే ఉండాలని సూచించారు. అధికారిక సోషల్ మీడియా, వెబ్‌సైట్‌లలో వాతావరణ సమాచారం తెలుసుకోవాలని చెప్పారు.

హైదరాబాద్ నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర సమయంలోనే బయటకు రావాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular