
కొత్త కెప్టెన్.. షాక్ అయ్యేలా న్యూ టీమ్ సెలెక్షన్
న్యూస్ డెస్క్: ఆస్ట్రేలియా పర్యటన కోసం భారత క్రికెట్ నియామక కమిటీ నేడు కొత్త వన్డే, టీ20 జట్లను ప్రకటించింది. ఈసారి సెలెక్టర్లు యువతకు ప్రాధాన్యం ఇచ్చి, సీనియర్ ఆటగాళ్లతో సమతుల్యత సాధించే ప్రయత్నం చేశారు.
ప్రధానంగా వన్డే జట్టుకు కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్‌ను నియమించడం ఈసారి ప్రత్యేకంగా నిలిచింది.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి సీనియర్ ఆటగాళ్లు తిరిగి జట్టులోకి వచ్చారు. శ్రేయాస్ అయ్యర్ వైస్ కెప్టెన్‌గా నియమితులయ్యారు.
ఇక ఆంధ్ర క్రికెట్ సర్క్యూట్ నుండి నితీశ్ కుమార్ రెడ్డి తొలిసారి వన్డే జట్టులో చోటు దక్కించుకున్నాడు. హార్దిక్ పాండ్యాకు విశ్రాంతి ఇవ్వగా, బుమ్రా కేవలం టీ20 సిరీస్‌కి మాత్రమే ఎంపికయ్యాడు.
యువ ఓపెనర్ అభిషేక్ శర్మను అభిమానులు వన్డే జట్టులో చూస్తారని ఆశించినా, సెలెక్టర్లు అతడిని కేవలం టీ20లకే పరిమితం చేశారు. మూడు వన్డేలు అక్టోబర్ 19 నుంచి, ఐదు టీ20లు అక్టోబర్ 29 నుంచి ప్రారంభమవుతాయి.
వన్డే జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, ధ్రువ్ జురేల్, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా.
టీ20 జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్, రింకూ సింగ్, తిలక్ వర్మ, జితేశ్ శర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, దూబే, సుందర్, అక్షర్, వారుణ్ చక్రవర్తి, బుమ్రా, హర్షిత్ రాణా, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్.