Saturday, October 3, 2026
HomeMovie Newsఅల్లు అర్జున్, అట్లీ సినిమా కోసం స్పెషల్ సాంగ్?

అల్లు అర్జున్, అట్లీ సినిమా కోసం స్పెషల్ సాంగ్?

allu-arjun-atlee-movie-special-song-update

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌పై ఉన్న అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర అప్‌డేట్ బయటకు వచ్చింది. 

లేటెస్ట్ సమాచారం ప్రకారం, ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌ను డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పాటలో ఒక స్టార్ హీరోయిన్‌ను తీసుకునే ఆలోచనలో ఉన్నారని టాక్.

కమర్షియల్ ఎలిమెంట్స్‌కి పెద్దపీట వేసే అట్లీ, ఈ సాంగ్‌ను మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా రూపొందిస్తున్నాడని సమాచారం. 

అయితే, ఆ సాంగ్ కోసం ఏ హీరోయిన్‌ను ఫైనల్ చేస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. ఇప్పటికే దీపికా పడుకోణె హీరోయిన్‌గా నటిస్తుండగా, ఈ స్పెషల్ సాంగ్ కోసం మరో అగ్రతారను రప్పించే అవకాశముందని చెబుతున్నారు.

మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ చిత్రానికి అట్లీ పవర్‌ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేశాడు. సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో యాక్షన్, ఎమోషన్, మాస్ ఎలిమెంట్స్ మేళవింపు ఉండనుందని టాక్. త్వరలోనే మిగతా నటీనటుల వివరాలు అధికారికంగా వెల్లడించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular