Saturday, May 9, 2026
HomeInternationalభారత విద్యార్థులకు అమెరికా ఆకర్షణ తగ్గుతుందా?

భారత విద్యార్థులకు అమెరికా ఆకర్షణ తగ్గుతుందా?

indian-students-decline-in-us-visas-2025

న్యూస్ డెస్క్: అమెరికాలో చదువు అనే కల ఇప్పుడు చాలా మందికి కాస్త దూరమవుతోంది. ట్రంప్ ప్రభుత్వంలోని కఠినమైన ఇమ్మిగ్రేషన్, వీసా నియంత్రణలతో భారత విద్యార్థులు కొత్త దారులు వెతుక్కుంటున్నారు.

ఇంటర్నేషనల్ ట్రేడ్ కమిషన్ తాజా గణాంకాల ప్రకారం, ఈ ఏడాది ఆగస్టులో అమెరికా జారీ చేసిన విద్యార్థి వీసాలు 19 శాతం తగ్గగా, భారత విద్యార్థుల విషయంలో ఇది 44 శాతం వరకు పడిపోయింది.

వీసా ఇంటర్వ్యూల కఠినతరం, సోషల్ మీడియా వెట్టింగ్ విధానం, హెచ్-1బీ వీసా రుసుముల పెంపు విద్యార్థుల్లో భయాందోళనలు పెంచాయి.

చదువు తర్వాత ఉద్యోగం సాధ్యమవుతుందా అన్న అనిశ్చితి కారణంగా చాలా మంది యువత అమెరికా బదులుగా కెనడా, యూరప్, ఆస్ట్రేలియా వంటి దేశాలను ఎంచుకుంటున్నారు.

అమెరికా ఇప్పటికీ విద్యా అవకాశాల్లో అగ్రస్థానంలో ఉన్నప్పటికీ, ఈ వీసా విధాన మార్పులు అంతర్జాతీయ విద్యార్థుల ప్రవాహంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.

నిపుణుల ప్రకారం, ఈ తగ్గుదల అమెరికా విశ్వవిద్యాలయాల ఆదాయాన్ని కూడా దెబ్బతీస్తుంది. ట్రంప్ పాలసీలు భారత విద్యార్థుల కలను కత్తిరిస్తున్నాయని విద్యా వేత్తలు అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular