
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్ గా బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న అవైటెడ్ సినిమా “పెద్ది” ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. గేమ్ ఛేంజర్ లాంటి ఫెయిల్యూర్ తర్వాత కూడా ఈ చిత్రంపై ఉన్న హైప్ వల్ల భారీ బిజినెస్ జరుగుతోందని సమాచారం.
యూఎస్ మార్కెట్ లో ఈ సినిమాకు సాలిడ్ డిమాండ్ ఏర్పడింది. ట్రేడ్ వర్గాల టాక్ ప్రకారం “పెద్ది” 8 మిలియన్ డాలర్ల టార్గెట్ తో అమెరికాలో రిలీజ్ కానుందని చెబుతున్నారు. ఇది రామ్ చరణ్ కెరీర్ లోనే అత్యధిక అంచనాల బిజినెస్ గా భావిస్తున్నారు.
ఈ హైప్ కు కారణం బుచ్చిబాబు స్టోరీ ట్రీట్మెంట్ పై ఉన్న నమ్మకం. రామ్ చరణ్ ఈ సినిమాలో కొత్త లుక్ తో కనిపించబోతున్నాడు. జాన్వీ కపూర్ తో అతని ఆన్స్క్రీన్ కెమిస్ట్రీ కూడా బలంగా నిలుస్తుందని టీమ్ విశ్వాసం వ్యక్తం చేస్తోంది.
సినిమాలో శివ రాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంగీతం ఏ ఆర్ రెహమాన్ అందిస్తుండటం ప్రత్యేక ఆకర్షణగా మారింది.
వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం వచ్చే ఏడాది మార్చి 27న గ్రాండ్ రిలీజ్ కోసం సిద్ధమవుతోంది. యూఎస్ ప్రీమియర్స్ నుంచే సినిమా రికార్డులు బద్దలు కొడుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.
