
బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ధురంధర్’ బాక్సాఫీస్ వద్దే కాదు, ఓటీటీ బిజినెస్ లోనూ సంచలనం సృష్టిస్తోంది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ స్పై థ్రిల్లర్ వెబ్ సిరీస్ తరహాలో 8 చాప్టర్లుగా ఉండటం విశేషం.
ఐదు దేశాల్లో నిషేధం ఉన్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా రూ.600 కోట్లు కొల్లగొట్టిన ఈ చిత్రం ఇప్పుడు అల్లు అర్జున్ ‘పుష్ప 2’ రికార్డును బ్రేక్ చేసింది.
ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ‘ధురంధర్’ డిజిటల్ హక్కులను ఏకంగా రూ.285 కోట్లకు కొనుగోలు చేసింది. గతంలో ‘పుష్ప 2’ రూ.275 కోట్ల డీల్ కుదుర్చుకోగా, రణ్‌వీర్ సినిమా దాన్ని 10 కోట్ల మార్జిన్ తో అధిగమించి కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసింది.
కేవలం ఓటీటీలోనే కాకుండా హిందీ థియేట్రికల్ వసూళ్లలోనూ బన్నీ రికార్డును ఈ సినిమా దాటేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
అసలు కథే చెప్పని పార్ట్-1 ఇంత విధ్వంసం సృష్టిస్తే, వచ్చే ఏడాది మార్చి 19న రాబోయే సీక్వెల్ ‘ధురంధర్ 2’ ఇంకెన్ని రికార్డులు తిరగరాస్తుందో అని బాలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
