
ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘అవతార్ 3’ (ఫైర్ అండ్ యాష్) రేపు విడుదల కాబోతోంది. ఈ క్రమంలో ఇండియాలో వేసిన స్పెషల్ ప్రీమియర్ షోను టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ వీక్షించారు.
సినిమా చూసిన అనంతరం ఆయన ఇచ్చిన రివ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జేమ్స్ కామెరూన్ సృష్టించిన ఈ విజువల్ వండర్ పై సుకుమార్ ప్రశంసల వర్షం కురిపించారు.
“3 గంటల 17 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా నాకు క్షణాల్లో అయిపోయినట్లు అనిపించింది. నేను పూర్తిగా పండోరా ప్రపంచంలోకి వెళ్లిపోయాను. కచ్చితంగా ఇది బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది” అని సుకుమార్ పేర్కొన్నారు.
ముఖ్యంగా హాలీవుడ్ సినిమా అయినప్పటికీ, ఇందులో మన తెలుగు సినిమాల్లో ఉండే బలమైన ఎమోషన్స్ ఉన్నాయని ఆయన చెప్పారు. కొన్ని సన్నివేశాలు చూస్తున్నప్పుడు తన కళ్లల్లో నీళ్లు వచ్చాయని, విజువల్స్ పాత్రలు తన మైండ్ నుంచి ఇంకా వెళ్లలేదని సుకుమార్ ఎమోషనల్ అయ్యారు.
ఇది కచ్చితంగా థియేటర్లలోనే చూడాల్సిన సినిమా అని ఆయన తేల్చిచెప్పారు. అవతార్ సిరీస్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు దానికి తోడు ‘పుష్ప 2’తో పాన్ ఇండియా రేంజ్ లో సంచలనం సృష్టించిన సుకుమార్ పాజిటివ్ రివ్యూ ఇవ్వడంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి.
