Saturday, June 13, 2026
HomeNationalరాహుల్.. బీహార్‌లో మళ్లీ అదే తప్పా?

రాహుల్.. బీహార్‌లో మళ్లీ అదే తప్పా?

rahul-gandhi-bihar-alliance-mistakes

న్యూస్ డెస్క్: కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో చేసిన వ్యూహపరమైన పొరపాట్లు ఇప్పుడు బీహార్‌లో కూడా పునరావృతమవుతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఢిల్లీ, జమ్ము కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్‌లలో పొత్తుల విషయంలో చివరి నిమిషం వరకు ఆలోచించి అవకాశాలు కోల్పోయిన కాంగ్రెస్, ఇప్పుడు అదే మార్గంలో నడుస్తోందని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

ప్రస్తుతం బీహార్‌లో కాంగ్రెస్ ఆర్జేడీతో పొత్తు పెట్టుకుంది. కానీ, సీట్ల పంపకం, ముఖ్యంగా ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో స్పష్టత ఇవ్వకపోవడం కూటమి భవిష్యత్తుపై అనిశ్చితిని పెంచుతోంది. తేజస్వి యాదవ్ ఇప్పటికే తానే సీఎం అభ్యర్థినని ప్రకటించగా, కాంగ్రెస్ మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. దీని వలన మ‌హాఘ‌ట్‌బంధన్‌లో విభేదాలు ముదురే అవకాశం ఉందని నేతలు అంటున్నారు.

గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ, ఫరూక్ అబ్దుల్లా పార్టీతో పొత్తు విషయంలో చేసిన తప్పులు కాంగ్రెస్‌కు పెద్ద నష్టం తెచ్చాయి. ఇప్పుడు అదే తప్పు బీహార్‌లోనూ చేస్తే, పార్టీకి మిగిలేది ప్రతిష్ట మాత్రమేనని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

బీహార్ రాజకీయాలు క్షణక్షణం మారుతుండగా, కాంగ్రెస్ తన వ్యూహం స్పష్టత ఇవ్వకపోతే, తేజస్వి నేతృత్వంలోని ఆర్జేడీకి మరింత ప్రాధాన్యం దక్కే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ సారి పొత్తు రాజకీయాల కంటే ప్రజాభిప్రాయమే కాంగ్రెస్ భవిష్యత్తు నిర్ణయించనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular