
న్యూస్ డెస్క్: భారత్ రక్షణ రంగంలో మరో అద్భుతం ఆవిష్కృతం కానుంది. ఇప్పటికే శత్రువుల గుండెల్లో దడ పుట్టించిన బ్రహ్మోస్ క్షిపణి తర్వాత, ఇప్పుడు మరింత శక్తివంతమైన హైపర్‌సోనిక్ క్షిపణి ‘ధ్వని’ని డీఆర్‌డీఓ సిద్ధం చేస్తోంది.
‘ధ్వని’ అనే హైపర్‌సోనిక్ గ్లైడ్ వెహికల్ రాకెట్ సాయంతో వాయుమండలంలో ఎత్తుకు వెళ్లి, అక్కడి నుంచి విడిపోయి సుపర్సోనిక్ వేగంతో టార్గెట్ వైపు దూసుకెళ్తుంది. ఈ క్షిపణి గంటకు 7,400 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదని సమాచారం.
1,500 నుంచి 2,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను నిమిషాల్లో ఛేదించే సామర్థ్యం దీంట్లో ఉంటుంది. దిశ మార్చుకునే స్కిల్స్ వల్ల శత్రు దేశాల రక్షణ వ్యవస్థలు స్పందించే లోపు ఈ క్షిపణి పని పూర్తి చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఇప్పటికే ఏరోడైనమిక్స్, స్క్రామ్‌జెట్ ఇంజిన్, థర్మల్ మేనేజ్‌మెంట్ వంటి టెస్టులు పూర్తయ్యాయి. ఈ ఏడాది చివరి నాటికి పూర్తి స్థాయి ప్రయోగాలు జరపాలని డీఆర్‌డీఓ ప్రణాళిక.
అంతే కాదు… ఇజ్రాయెల్ ‘ఐరన్ డోమ్’, అమెరికా ‘థాడ్’ వంటి రక్షణ వ్యవస్థలు కూడా దీనిని ఆపడం కష్టం అవుతుందని విశ్లేషకుల అంచనా.
ఇదే సమయంలో, భారత్ రక్షణ స్వయం సమృద్ధికి ‘ధ్వని’ ఒక గేమ్ చేంజర్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
