
న్యూస్ డెస్క్: ప్రతిష్టాత్మకమైన వైజయంతి మూవీస్ బ్యానర్ నుంచి మరో సరికొత్త ప్రాజెక్ట్ రాబోతోంది. ఈసారి లేడీ ఓరియెంటెడ్ కథతో నూతన దర్శకుడికి ఛాన్స్ ఇస్తున్నారని ఫిల్మ్‌నగర్ టాక్.
“మహానటి” తర్వాత ఈ బ్యానర్ నుండి వస్తున్న ఫిమేల్ సెంట్రిక్ సినిమా కావడంతో భారీ క్రేజ్ నెలకొంది. ఇంట్రెస్టింగ్‌గా, ఈ ప్రాజెక్ట్‌లో హీరోయిన్‌గా శ్రీలీల లేదా భాగ్యశ్రీని తీసుకునే ఆలోచనలో ఉన్నారని సమాచారం.
ఇద్దరి పేర్లు కూడా చర్చల్లో ఉండగా, ఫైనల్ అనౌన్స్‌మెంట్ త్వరలో రానుంది. “చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా” అనే టైటిల్ పరిశీలనలో ఉందట. టైటిల్ వినగానే ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగిపోయింది.
వైజయంతి బ్యానర్ ఎప్పుడూ కంటెంట్ డ్రివెన్ సినిమాలకు ప్రాధాన్యం ఇస్తూ, కమర్షియల్ టచ్‌తో కూడిన చిత్రాలు చేస్తుంది. అదే దారిలో కొత్త దర్శకుడి కథ వినిపించి, వెంటనే ఓకే చెప్పారని ఇండస్ట్రీ టాక్. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు బలమైన స్కోప్ ఉందట.
భాగ్యశ్రీ ఇటీవల “కింగ్‌డమ్” సినిమాతో ఎంట్రీ ఇచ్చినా, పెద్దగా సక్సెస్ కాలేదు. అయితే, ఈ ప్రాజెక్ట్ దక్కితే ఆమెకు గేమ్‌చేంజర్ అవుతుందని అంటున్నారు. శ్రీలీల విషయానికి వస్తే, సౌత్‌తో పాటు బాలీవుడ్‌లో కూడా బిజీగా మారింది.
ఇదిలా ఉండగా, వైజయంతి బ్యానర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందించిన “కల్కి 2898 AD” భారీ విజయం సాధించింది. ఇప్పుడు ఈ కొత్త లేడీ ఓరియెంటెడ్ సినిమా వైజయంతి మాస్టర్ ప్లాన్‌లో భాగంగా రాబోతోంది.
