Friday, November 14, 2025
HomeMovie Newsమెగాస్టార్‌,‌ రావిపూడి.. కామెడీ ట్రాక్

మెగాస్టార్‌,‌ రావిపూడి.. కామెడీ ట్రాక్

megastar-chiranjeevi-anil-ravipudi-movie-fun-episode

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా, హిట్‌ డైరెక్టర్‌ అనీల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా “మన శంకర వర ప్రసాద్ గారు” చుట్టూ భారీ హైప్‌ నెలకొంది. టైటిల్‌ నుండి పోస్టర్‌ వరకు పాజిటివ్‌ వైబ్స్‌ సృష్టించిన ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్‌ చివరి దశలో ఉంది. చిరు అనీల్‌ కాంబో అంటేనే ఫ్యాన్స్‌లో హ్యూజ్‌ ఎక్స్‌పెక్టేషన్స్‌.

తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాలో చిరంజీవి వెంకటేష్‌ మధ్య ఒక ప్రత్యేక కామెడీ ట్రాక్‌ ఉండబోతోందట. ఇద్దరి టైమింగ్‌ తో రూపొందిన ఆ సీక్వెన్స్‌ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని టాక్‌.

అనీల్‌ రావిపూడి తనకు సొంతమైన స్టైల్లో హాస్యాన్ని, ఎమోషన్‌ మేళవించి ఈ ఎపిసోడ్‌ను డిజైన్‌ చేస్తున్నాడని తెలుస్తోంది. ప్రేక్షకులను నవ్వులతో ముంచెత్తే లెవెల్‌లో కామెడీ సీన్‌ ఉంటుందని యూనిట్‌ వర్గాలు చెబుతున్నాయి.

సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్‌, ఎంటర్టైన్మెంట్‌ రెండూ సమానంగా ఉంటాయని అంటున్నారు. భీమ్స్‌ సిసిరోలియో ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా, సాహు గారపాటి నిర్మాణం వహిస్తున్నారు.

వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది. “భోళా శంకర్‌” తర్వాత చిరు నుంచి వస్తున్న ఈ చిత్రం మాస్‌ మరియు ఫ్యామిలీ ఆడియన్స్‌ కోసం సాలిడ్‌ ట్రీట్‌గా మారే అవకాశముంది. ఫ్యాన్స్‌ అయితే ఇప్పటికే “చిరు వెంకీ కాంబో ఫన్‌ బ్లాస్ట్‌” కోసం వేచి చూస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular