Tuesday, May 12, 2026
HomeMovie Newsనోరా ఫతేహి రీ ఎంట్రీతో రష్మికకు పోటీ పెరిగిందా?

నోరా ఫతేహి రీ ఎంట్రీతో రష్మికకు పోటీ పెరిగిందా?

nora-fatehi-vs-rashmika-thama-movie-special-song

బాలీవుడ్‌లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది “థామా” సినిమా. ఆయుష్మాన్ ఖురానా, రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న ఈ హారర్ రొమాంటిక్ కామెడీ అక్టోబర్ 21న రిలీజ్‌కు సిద్ధమవుతోంది.

అయితే ఈ సినిమా ట్రైలర్ కంటే ఎక్కువగా ఆకట్టుకుంటున్నది నోరా ఫతేహి స్పెషల్ సాంగ్ “దిల్బార్ కి ఆంఖోన్ కా”.

తాజాగా విడుదలైన ఈ పాటతో నోరా మళ్లీ తన గ్లామర్, డ్యాన్స్ మువ్స్‌తో అభిమానులను మంత్ర ముగ్ధులను చేసింది. ఇంతకాలం ఆమె నుండి స్పెషల్ సాంగ్స్ రాకపోవడంతో ఫ్యాన్స్ నిరాశ చెందగా, ఈ పాటతో మళ్లీ ఆమె పాత వైబ్‌ను రీ క్రియేట్ చేసింది.

“స్త్రీ 1”లోని కమారియా, “సత్యమేవ జయతే”లోని దిల్బర్ లాంటి హిట్ నంబర్స్‌ తర్వాత, ఈ పాట ఆమె కెరీర్‌కు మరో మలుపు తీసుకురావచ్చని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

మరోవైపు, థామా ట్రైలర్‌లో రష్మిక కంటే నోరా స్క్రీన్ ప్రెజెన్స్ ఎక్కువగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. దీంతో “రష్మికను బీట్ చేయగలదా నోరా?” అనే చర్చ మొదలైంది.

థామా మూవీని ఆదిత్య సర్పోత్దార్ డైరెక్ట్ చేస్తుండగా, మాడాక్ ఫిలిమ్స్ నిర్మిస్తోంది. నవాజుద్దీన్ సిద్ధిఖీ, పరేష్ రావల్ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular