Tuesday, July 28, 2026
HomeMovie Newsప్రభాస్ స్పిరిట్ కోసం కొత్త లుక్ రెడీ

ప్రభాస్ స్పిరిట్ కోసం కొత్త లుక్ రెడీ

prabhas-spirit-movie-update

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న తదుపరి భారీ ప్రాజెక్ట్ “స్పిరిట్”పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పవర్‌ఫుల్ పోలీస్ డ్రామాగా రూపొందుతోంది. 

ప్రభాస్ ఇందులో కాప్ అవతారంలో కనిపించబోతుండటంతో ఫ్యాన్స్‌లో భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఏర్పడ్డాయి. ఈ సినిమాలో తన పాత్ర కోసం ప్రభాస్ ప్రత్యేక కసరత్తులు చేస్తున్నాడు. 

ఫిట్‌గా కనిపించడానికి డైట్ ప్లాన్ మార్చుకుని, కొత్తగా వర్కౌట్స్ చేస్తున్నాడని సమాచారం. అంతేకాదు, ఈ సినిమాలో ఆయన లుక్‌లో పెద్ద మార్పులు ఉండనున్నాయి. కొత్త హెయిర్ స్టైల్‌తో ప్రభాస్ కనిపించనున్నాడని సినీ వర్గాలు చెబుతున్నాయి.

హీరోయిన్‌గా త్రిప్తి దిమ్రిని ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఈ జంట స్క్రీన్‌పై కొత్త ఫ్రెష్‌నెస్ ఇవ్వనుందని మేకర్స్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

మ్యూజిక్ బాధ్యతలు హర్షవర్ధన్ రామేశ్వర్ భుజాన పడ్డాయి. ఆయన ఇప్పటికే డైరెక్టర్‌తో కలిసి సిట్టింగ్స్ పూర్తి చేశారు. ప్రభాస్ సినిమాలకు ప్రత్యేకమైన విజిల్ సౌండ్ సెంటిమెంట్ ఉంటుందని, ఈ సినిమాకి కూడా అదే కొనసాగిస్తానని ఆయన వెల్లడించారు.

“స్పిరిట్” సినిమాను టి సిరీస్, భద్రకాళి పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ ప్రభాస్ కెరీర్‌లోనే కాకుండా సందీప్ రెడ్డి వంగా కెరీర్‌లో కూడా మరో మైలురాయిగా నిలుస్తుందని టాక్ నడుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular