
ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న భారీ ప్రాజెక్ట్ “డ్రాగన్”పై రోజురోజుకీ ఆసక్తి పెరుగుతోంది. ఈ సినిమా కోసం ప్రశాంత్ నీల్ ఒక లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాడని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ షెడ్యూల్‌లో యాక్షన్ సన్నివేశాలు మాత్రమే కాకుండా ఓ ప్రత్యేక సాంగ్ కూడా షూట్ చేయబోతున్నారు.
ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్‌లో కనిపించబోతున్నాడు. ఒకటి ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో కనిపించే పాత్ర. ఆ పాత్ర కోసం కొత్త లుక్‌ను ట్రై చేస్తున్నాడని సమాచారం. ఈ గెటప్ ఫ్యాన్స్‌కు కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇవ్వబోతుందని అంచనాలు ఉన్నాయి.
ప్రశాంత్ నీల్ ఈ ప్రాజెక్ట్‌ను ఎన్టీఆర్ కెరీర్‌లోనే మైలురాయిగా నిలిచేలా తీర్చిదిద్దుతున్నాడని తెలుస్తోంది. అందుకే స్క్రిప్ట్ కోసం ఎక్కువ సమయం వెచ్చించి ప్రతి డీటైల్‌పై శ్రద్ధ చూపాడని సర్కిల్ టాక్.
“డ్రాగన్” సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం భారీ బడ్జెట్ కేటాయించారని, సెట్ డిజైన్స్ నుండి యాక్షన్ సీక్వెన్స్ వరకు ప్రతి విభాగం అత్యంత గ్రాండ్‌గా ఉండబోతుందని తెలుస్తోంది.
