
న్యూస్ డెస్క్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో టాలెంట్‌కు ఎంత డిమాండ్ ఉందో చూపించే ఉదాహరణగా మారింది మాట్ డీట్కే వ్యవహారం. కేవలం 24 ఏళ్ల వయసులోనే ఈ యువ ఏఐ పరిశోధకుడు టెక్ ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించాడు.
మెటా సంస్థ మొదట అతనికి 125 మిలియన్ డాలర్ల ప్యాకేజీ ఆఫర్ చేయగా, తిరస్కరించడంతో CEO మార్క్ జుకర్‌బర్గ్ స్వయంగా రంగంలోకి దిగారు.
జుకర్‌బర్గ్ చేసిన చర్చల తర్వాత ఆఫర్‌ను రెట్టింపు చేస్తూ 250 మిలియన్ డాలర్ల (రూ.2,085 కోట్లకు పైగా) భారీ డీల్‌కి ఒప్పించగలిగారు. ఈ ఒప్పందంలో భాగంగా మొదటి ఏడాదిలోనే డీట్కేకు 100 మిలియన్ డాలర్లు అందనున్నట్లు సమాచారం.
వాషింగ్టన్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ మధ్యలోనే ఆపి, పరిశోధనలపై దృష్టి సారించిన డీట్కే, న్యూరిప్స్ కాన్ఫరెన్స్‌లో ఉత్తమ పేపర్ అవార్డు పొందాడు. ఆ తర్వాత ‘మోల్మో’ అనే శక్తివంతమైన చాట్‌బాట్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాడు.
2023లో డీట్కే ‘వెర్‌సెప్ట్’ అనే స్టార్టప్ ప్రారంభించి గూగుల్ మాజీ CEO ఎరిక్ ష్మిత్ సహా ప్రముఖుల నుంచి రూ.137 కోట్ల పెట్టుబడులు పొందాడు. కేవలం 10 మంది టీమ్‌తో ముందుకు సాగుతున్నాడు.
ఈ ఘటనతో ఏఐ రంగంలో నిపుణుల విలువ ఏ స్థాయిలో ఉందో స్పష్టమవుతుంది. “ఇది నిజంగా ‘నెర్డ్స్’ రివెంజ్ కాలమని” MIT ఆర్థికవేత్త వ్యాఖ్యానించారు.