Friday, April 17, 2026
HomeMovie Newsరాజా సాబ్ మూవీకి 4.5 గంటల ఫుటేజ్! షాకింగ్ రన్ టైమ్

రాజా సాబ్ మూవీకి 4.5 గంటల ఫుటేజ్! షాకింగ్ రన్ టైమ్

raja-saab-prabhas-horror-film-run-time-footage-update

ప్రభాస్ ఇప్పటివరకు చేసిన పాత్రలతో పోలిస్తే భిన్నమైన కంటెంట్‌తో వస్తున్న కొత్త సినిమా ద రాజా సాబ్ హారర్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇది ప్రభాస్ కెరీర్‌లో ఫస్ట్ హారర్ ఎంటర్టైనర్ కావడం విశేషం.

తాజాగా ఈ సినిమా గురించి నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఆయన చెప్పిన ప్రకారం సినిమా మొత్తం రఫ్ ఎడిట్ ఫుటేజ్ నాలుగు గంటల 30 నిమిషాలు ఉందట. అయితే థియేటర్లలో చూపించేందుకు దానిని కేవలం రెండు గంటల 45 నిమిషాల నిడివికి కట్ చేస్తారట. అంటే దాదాపు రెండు గంటల ఫుటేజ్‌ను తీసేయనున్నారు.

ఇంత పెద్ద మొత్తంలో ఫుటేజ్ తీయడం మామూలు విషయం కాదు. ఈ నేపథ్యంలో మేకర్స్ ఏ సన్నివేశాలు ఎడిట్ చేస్తారు, ప్రేక్షకులకు ఏ భాగాలను చూపించాలనుకుంటున్నారు అనే విషయాల్లో ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది. హారర్, కామెడీ మిక్స్‌తో వస్తున్న ఈ సినిమా విజువల్స్‌ను చాలా ప్రత్యేకంగా రూపొందిస్తున్నారట.

ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా… బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మీద స్పెషల్ కేర్ తీసుకుంటున్నట్టు సమాచారం. హారర్ సినిమాల్లో సంగీతం కీలకం కనుక, థమన్ మార్క్ స్కోర్‌తో మరింత థ్రిల్ ఫీల్ రావచ్చని యూనిట్ చెబుతోంది.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. ఇప్పటికే షూటింగ్ చివరి దశలో ఉంది. టీజర్ ఆగస్టు 23 లేదా 24లో విడుదల అయ్యే ఛాన్స్ ఉంది. రన్ టైమ్ విషయంలో మాత్రం తక్కువగా కాకుండా మరింత గ్రిప్పింగ్‌గా ఉంటుందని యూనిట్ నమ్మకంగా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular