
న్యూస్ డెస్క్: కొన్ని వారాలుగా పతనాన్ని కొనసాగించిన భారత రూపాయి, ఈ రోజు అమెరికా డాలర్‌తో పోలిస్తే కొంత బలపడింది. ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకం విలువ ₹87.36 వద్ద స్థిరపడగా, గత కాలంతో పోలిస్తే ఇది స్వల్ప ఊరటగా భావిస్తున్నారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో రూపాయి ₹88.10 కనిష్ఠ స్థాయికి చేరింది. అక్కడి నుంచి రూపాయి కొంత కోలుకోవడం కొద్దిగా సానుకూల సంకేతంగా నిపుణులు భావిస్తున్నప్పటికీ, ఇది తాత్కాలికమే కావచ్చని అంటున్నారు.
గత నెలలో రూపాయి విలువ 1.77 శాతం పడిపోయింది. ఏడాది మొత్తం చూస్తే ఇది 4.06 శాతం బలహీనపడింది. డాలర్‌తో పోలిస్తే ఈ ఏడాది 1.82 శాతం నష్టం నమోదైంది.
రూపాయి బలహీనతపై రిజర్వ్ బ్యాంక్ చర్యలు, అంతర్జాతీయ మార్కెట్ల పరిస్థితులు, దేశీయ ఆర్థిక గణాంకాలు ప్రభావం చూపిస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు. ఈ ఫ్లక్చుయేషన్‌లో మౌలిక ఆర్థిక అంశాలే కీలకం అవుతాయి.
ఈ త్రైమాసికం చివరిలో రూపాయి విలువ మళ్లీ ₹87.52కి చేరే అవకాశముందని అంచనా. దీర్ఘకాలం నిలకడ కావాలంటే, దేశ ఆర్థిక వ్యవస్థ స్థిరపడాల్సిన అవసరం ఉందని నిపుణుల అభిప్రాయం.
