Friday, September 19, 2025
HomeMovie Newsబెల్లంకొండ ‘కిష్కింధపురి’.. రెండో రోజు వసూళ్లు రికార్డ్ రేంజ్‌లో!

బెల్లంకొండ ‘కిష్కింధపురి’.. రెండో రోజు వసూళ్లు రికార్డ్ రేంజ్‌లో!

kishkindhapuri-day2-collections-boxoffice

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన కిష్కింధపురి విడుదలైన రెండో రోజే బాక్సాఫీస్ వద్ద సూపర్ హవా కొనసాగించింది. హారర్ జానర్‌లో రొమాంటిక్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన ఈ మూవీ ఫస్ట్ డే కంటే ఎక్కువ వసూళ్లు సాధించింది.

శనివారం సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అనేక కేంద్రాల్లో హౌస్‌ఫుల్స్ నమోదు అయ్యాయి. బుక్‌మైషోలో శుక్రవారం 50వేల టికెట్లు అమ్ముడవ్వగా, శనివారం ఆ సంఖ్య 75వేల దాటింది. ఆదివారం మరింత జోరుగా వసూళ్లు వచ్చే అవకాశం కనిపిస్తోంది.

నాన్-థియేట్రికల్ డీల్స్ ఇప్పటికే బాగుండటంతో బ్రేక్ ఈవెన్ త్వరగా చేరే పరిస్థితి ఏర్పడింది. ఈ వీకెండ్‌కే లాభాలు నమోదు కావచ్చని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

సాయి శ్రీనివాస్ మాస్ పుల్, ఆసక్తికరమైన కథాంశం, టెక్నికల్ స్ట్రాంగ్ పాయింట్స్ ఈ విజయానికి కారణమని అంటున్నారు. అనుపమ పరమేశ్వరన్ జంటగా కనిపించగా, చైతన్ భరద్వాజ్ మ్యూజిక్ మూవీకి అదనపు బలం ఇచ్చింది.

కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వంలో, సాహు గారపాటి నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా, బెల్లంకొండ కెరీర్‌లో మరో సాలిడ్ హిట్‌గా నిలుస్తుందని అంచనాలు వేస్తున్నారు.

మొత్తానికి కిష్కింధపురి ఫస్ట్ డే కన్నా రెండో రోజు వసూళ్లతో ఆడియన్స్ దృష్టిని ఆకర్షించింది. ఈ హవా కొనసాగితే మూవీ బాక్సాఫీస్ వద్ద బిగ్ హిట్‌గా మారడం ఖాయం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular