Saturday, March 14, 2026
HomeMovie Newsమహేష్ - వంగా కాంబో.. టాలీవుడ్‌కి మరో సెన్సేషన్ కాబోతుందా?

మహేష్ – వంగా కాంబో.. టాలీవుడ్‌కి మరో సెన్సేషన్ కాబోతుందా?

mahesh-babu-sandeep-vanga-project-talk

టాలీవుడ్‌లో స్టార్ హీరోలు, క్రియేటివ్ డైరెక్టర్ల కాంబినేషన్లు ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతాయి. తాజాగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది మహేష్ బాబు – సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్. ఈ కాంబినేషన్ గురించి చాలా కాలంగా రూమర్స్ ఉన్నా.. ఇప్పుడు ప్లాన్ క్లియర్ అవుతోందనే టాక్ వినిపిస్తోంది.

‘అర్జున్ రెడ్డి’ తర్వాత నుంచే ఈ కాంబోపై చర్చ మొదలైంది. ఆ సమయంలో మహేష్ రిస్క్ చేయలేదు. కానీ అప్పట్లో ‘యానిమల్’ ప్రమోషన్స్‌లో వంగా చేసిన వ్యాఖ్యలు మళ్లీ హైప్ క్రియేట్ చేశాయి. ఆయన మాటల్లో “మహేష్ కోసం మరింత వైలెంట్ కథ రెడీగా ఉంది” అన్న లైన్ ఫ్యాన్స్‌లో క్రేజ్ పెంచింది.

ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లడంలో AMB సినిమాస్ భాగస్వామి ఏషియన్ సునీల్ కీలకంగా ఉన్నారని సమాచారం. సునీల్ వంగా కాంబో ఇప్పటికే ఫిక్స్ కావడంతో, ఆ డీల్‌ను మహేష్ ప్రాజెక్ట్‌గా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయట. అదే సమయంలో మైత్రి మూవీ మేకర్స్ కూడా ఈ ప్రాజెక్ట్ కోసం రేసులోకి వచ్చారని టాక్.

మహేష్ ప్రస్తుతం SSMB29 (రాజమౌళి ప్రాజెక్ట్) మీద ఫోకస్ చేస్తున్నారు. అది 2027 వరకు లాకవ్వడం ఖాయం. కాబట్టి వంగా కాంబో త్వరలో అనౌన్స్ అవ్వకపోయినా.. సైలెంట్‌గా ప్లాన్ అవుతున్నదనే టాక్ బలంగా వినిపిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular