న్యూస్ డెస్క్: ఆసియా కప్ 2025లో భారత్ పాక్ మ్యాచ్ ఈసారి పెద్దగా ఉత్కంఠ కలిగించకపోయినా, టీమ్ ఇండియా ఘన విజయాన్ని సాధించింది. దుబాయ్ వేదికగా జరిగిన ఈ పోరులో భారత్ 7 వికెట్ల తేడాతో గెలిచి, గ్రూప్ Aలో అగ్రస్థానంలో నిలిచింది.
పాక్ బ్యాటింగ్‌లో పూర్తిగా తడబడ్డారు. సహిబ్జాదా ఫర్హాన్ (40) తప్ప మిగతా బ్యాట్స్‌మెన్ రాణించలేదు. షాహీన్ అఫ్రిదీ (33 నాటౌట్, 4 సిక్సర్లు) కొంత పోరాడినా, జట్టు 20 ఓవర్లలో 127 పరుగులకే పరిమితమైంది. కుల్దీప్ యాదవ్ (3/18), అక్షర్ పటేల్ (2/18), బుమ్రా (2/28) కీలక వికెట్లు తీశారు.
128 లక్ష్యాన్ని చేధించడానికి వచ్చిన భారత్ మొదటి నుంచే దూకుడు చూపించింది. అభిషేక్ శర్మ (31, 13 బంతుల్లో) పవర్‌ప్లేలోనే మ్యాచ్‌ను ఇండియా వైపు తిప్పేశాడు. గిల్ (10) ఔటైనా, సూర్యకుమార్ యాదవ్ (47 నాటౌట్) ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. తిలక్ వర్మ (31) మధ్యలో స్థిరత్వం ఇచ్చి, శివమ్ దూబే (10 నాటౌట్) తోడయ్యాడు.
బౌలర్ల అద్భుత ప్రదర్శనతో పాటు బ్యాట్స్‌మెన్ సమతుల్య ఆటతీరు మ్యాచ్‌ను క్లినికల్ విజయం దిశగా నడిపించింది. పవర్‌ప్లేలో పాక్‌ను కట్టడి చేసిన బౌలర్లు, ఆ తర్వాత రన్‌రేట్ తగ్గించడంతో భారత్‌కు విజయదారులు సులభం అయ్యాయి.
భారత్-పాక్ పోరులో మరోసారి టీమ్ ఇండియా ఆధిపత్యం చాటుకుంది. తక్కువ లక్ష్యం అయినా, దాన్ని సులభంగా ఛేదించడం ద్వారా తమ ఫామ్‌ను నిరూపించింది. ఈ గెలుపుతో భారత్ మరోసారి టోర్నమెంట్ ఫేవరెట్‌గా నిలిచింది.
