
టాలీవుడ్ లో ఇప్పుడు మాస్ సినిమాలకన్నా కంటెంట్ డ్రైవన్ సినిమాలు ఎక్కువ సక్సెస్ అవుతున్నాయి. ఇదే విషయాన్ని హీరో సాయి దుర్గా తేజ్ కూడా బలంగా చెప్పాడు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వచ్చిన కిష్కింధపురి సక్సెస్ మీట్ లో ఆయన ప్రత్యేక అతిథిగా హాజరయ్యాడు.
ఈ సందర్భంగా కొత్త తరహా కథలే ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తున్నాయని అన్నారు. నేటి ఆడియెన్స్ మాస్ కంటే కంటెంట్ ను ఎక్కువగా పట్టించుకుంటున్నారని ఆయన అభిప్రాయం.
లిటిల్ హార్ట్స్, మిరాయ్, కిష్కింధపురి లాంటి సినిమాలు అందుకు ఉదాహరణ అని చెప్పారు. “మంచి కథ ఉంటే టికెట్లు గంటలలోనే సేల్ అవుతున్నాయి. ఇది పరిశ్రమకు హెల్తీ సైన్” అని ఆయన అన్నారు.
సాయి దుర్గా తేజ్ మాట్లాడుతూ, “మన బాధ్యత కంటెంట్ ఉన్న సినిమాలు చేయడం. ఆడియెన్స్ కు కొత్త అనుభూతి ఇవ్వాలి. వాళ్లు ఆదరిస్తే థియేటర్స్ హౌస్ ఫుల్ అవుతాయి” అని అన్నారు.
ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్ తనకే కాదు, ఇండస్ట్రీ మొత్తానికి ఎనర్జీ ఇస్తోందని కూడా చెప్పారు. “ఫ్రెండ్స్ తో సినిమాకు టికెట్ బుక్ చేసుకోవాలని చెప్పాను. కానీ షోలు అన్నీ సేల్ అవ్వడం చూసి ఆనందం వేసింది” అని ఆయన చెప్పాడు.
అలాగే రాబోయే సూపర్ రాజా సినిమాను కూడా సాయి దుర్గా తేజ్ ప్రోత్సహించాడు. సింగిల్ షాట్ లో తెరకెక్కిన ఈ మూవీ కొత్త ప్రయత్నమని, కొత్తవాళ్లను ఎంకరేజ్ చేయాలని కోరాడు.
