
తెలంగాణ: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదేళ్లు సీఎం పదవిలో కొనసాగాలని లక్ష్యం పెట్టుకున్న సంగతి తెలిసిందే. పదవిలోకి వచ్చిన మొదటి రోజునుంచే ఆయన ఈ కలను బహిరంగంగానే వ్యక్తపరుస్తున్నారు.
భారీ పోటీ, అంతర్గత ప్రతికూలతల మధ్య కుర్చీ దక్కించుకున్న రేవంత్, ఇప్పుడు తన ఎజెండాను అమలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రతి అవాంతరాన్ని ఎదుర్కొంటూ, తన వ్యూహంతో పరిష్కారం చూపుతున్నారు.
పార్టీలోని అసంతృప్త వర్గాలను తన వైపు తిప్పుకోవడంలో రేవంత్ సక్సెస్ అయ్యారని విశ్లేషకులు చెబుతున్నారు. మంత్రులకు ఎక్కువ స్వేచ్ఛ ఇచ్చి, వారి శాఖలను స్వతంత్రంగా నడిపించుకునేలా చేసిన తీరు ఆయనకు ప్లస్ పాయింట్ అయ్యింది.
ఇటీవల విద్యాసంస్థల బంద్‌ను వేగంగా పరిష్కరించడంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు కూడా చర్చనీయాంశమయ్యాయి. సమస్యను మంత్రులకే వదిలేయడం ద్వారా వారి మీద నమ్మకం ఉంచినట్టు స్పష్టమైంది.
కేంద్రంతో కావాల్సిన పనులను సాధించుకుంటూనే, అవసరమైతే మాటల దాడి చేయడం రేవంత్ స్ట్రాటజీలో భాగమైందని చెబుతున్నారు. ఇలా ఇరువైపులా బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు.
ఈ తీరు కొనసాగితే రేవంత్ రెడ్డి పదేళ్ల సీఎం ఆపరేషన్ సాధ్యం కాదని అనేవారు కూడా ఇప్పుడు ఆలోచించేలా అయ్యారని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
