టాలీవుడ్ లో ఇటీవల మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్స్ గా నిలిచాయి. థియేటర్లకు ఆడియెన్స్ ను రప్పిస్తూ, మంచి కలెక్షన్లు రాబడుతున్నాయి. ఇవే లిటిల్ హార్ట్స్, మిరాయ్, కిష్కింధ పురి.
చిన్న సినిమా అయినా లిటిల్ హార్ట్స్ పెద్ద విజయం సాధించింది. తనూజ్ మౌళి, శివాని నాగారం జంటగా నటించిన ఈ మూవీ రొమాంటిక్ కామెడీగా అందరిని ఆకట్టుకుంది. బడ్జెట్ కు మించి లాభాలు సంపాదించడం గమనార్హం.
మిరాయ్ విషయానికొస్తే తేజ సజ్జ హీరోగా, కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రానా, మనోజ్, శ్రియ పాత్రలు హైలైట్ అయ్యాయి. ఫాంటసీ యాక్షన్ డ్రామాగా ఇది మంచి ఓపెనింగ్స్ సాధించింది. పాజిటివ్ టాక్ తో హౌస్ ఫుల్ షోస్ కొనసాగుతున్నాయి.
ఇక కిష్కింధ పురిలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా హారర్ థ్రిల్లర్ గా ఆకట్టుకుంటోంది. కొత్త కథనంతో ప్రేక్షకులను థ్రిల్ చేస్తోంది.
ఈ మూడు సినిమాలు చూపించిన విషయం ఒక్కటే. స్టార్ పవర్ అవసరం లేదు. కంటెంట్ బాగుంటే ఆడియెన్స్ తప్పకుండా ఆదరిస్తారు. హౌస్ ఫుల్ బోర్డులు మరోసారి అది రుజువు చేశాయి.
ఇటీవల “థియేటర్లకు ప్రేక్షకులు రావడం లేదని” కామెంట్లు వచ్చినా, ఈ మూడు చిత్రాల హిట్ రన్ చూసి ఆ మాటలు తప్పని నిరూపితమైంది. టాలీవుడ్ కి ఇది మంచి పాజిటివ్ సైన్ అని చెప్పాలి.
