Friday, March 13, 2026
HomeMovie Newsరాజా సాబ్ ఫ్యాన్ ఫీస్ట్.. ప్రభాస్ మాస్ జోష్ గ్యారంటీ!

రాజా సాబ్ ఫ్యాన్ ఫీస్ట్.. ప్రభాస్ మాస్ జోష్ గ్యారంటీ!

raja-saab-prabhas-sankranthi-release-plans

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో మారుతి దర్శకత్వం వహిస్తున్న రాజా సాబ్ సినిమా 2026 జనవరి 9న రిలీజ్ అవ్వబోతోంది. సంక్రాంతి బరిలో ప్రభాస్ స్టామినా చూపించబోతున్నాడని అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికే టీజర్‌తోనే సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాలో ప్రభాస్ ఎంట్రీ సాంగ్‌ను స్పెషల్ ర్యాప్ నంబర్‌గా ప్లాన్ చేస్తున్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కొత్తగా డిజైన్ చేసిన ఈ పాటలో ర్యాపర్ సూరజ్ చెరుకత్ వాయిస్ ఇవ్వనున్నాడు. అదనంగా ఒక బాలీవుడ్ క్లాసిక్ సాంగ్ రీమిక్స్ చేసే ఆలోచన కూడా ఉందని టాక్.

హీరోయిన్లుగా నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ నటిస్తున్నారు. మారుతి మార్క్ కామెడీతో పాటు మాస్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉంటాయని మేకర్స్ చెబుతున్నారు. హారర్ థ్రిల్లర్ జోనర్‌లోనే కొత్తగా ఈ కథను రూపొందిస్తున్నారు.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమా, ఇటీవల మిరాయ్ హిట్ జోష్‌ తర్వాత వస్తుండటంతో ట్రేడ్ వర్గాలు మరింత ఆసక్తిగా చూస్తున్నాయి.

ప్రస్తుతం సినిమా షూటింగ్ దాదాపు పూర్తయి, ఫ్యాన్స్ ఫీస్ట్ కోసం స్పెషల్ ప్లానింగ్ చేస్తున్నారు. ప్రభాస్ ఎలివేషన్స్, విజువల్స్, థమన్ మ్యూజిక్ కలిపి రాజా సాబ్ ను నెక్ట్స్ లెవెల్‌కి తీసుకెళ్తాయని అంటున్నారు.

సంక్రాంతి సీజన్‌లో భారీ పోటీ ఉన్నా, ప్రభాస్ ఇమేజ్, మాస్ కంటెంట్ వర్కౌట్ అవుతుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular