
విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమాతో కాస్త నిరాశపరిచాడు. మొదట బాగానే ఓపెనింగ్ వచ్చినా, లాంగ్ రన్‌లో నిలబడలేదు. దీంతో ఆయనకు సరైన హిట్ అవసరం ఎక్కువైంది. ఇప్పుడు ఆయన ఆశలన్నీ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందుతున్న VD14 ప్రాజెక్ట్‌పైనే ఉన్నాయి.
ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. హీరోయిన్‌గా రష్మిక మంధన్నా నటిస్తున్నారు. టాలీవుడ్‌లో వీళ్లిద్దరి జోడీకి ప్రత్యేక క్రేజ్ ఉండటంతో సినిమాపై హైప్ పెరిగింది.
అయితే ఈసారికి మరో అదనపు సర్ప్రైజ్ ఉంది. హాలీవుడ్ స్టార్ ఆర్నాల్డ్ వోస్లూ (ది మమ్మీ సిరీస్ ఫేమ్) విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇది టాలీవుడ్‌లో ఆయన తొలి అడుగు కావడం విశేషం.
విజయ్ ఈ సినిమాలో డైనమిక్ రోల్‌లో కనిపించనున్నాడని సమాచారం. రాహుల్ సంకృత్యాన్ స్టోరీ టెల్లింగ్ స్టైల్, హాలీవుడ్ విలన్ ఎంట్రీతో ఈ ప్రాజెక్ట్ గ్లోబల్ మార్కెట్‌కి చేరే అవకాశం ఉందని అనుకుంటున్నారు.
సోషల్ మీడియాలో ఇప్పటికే సినిమా గురించి భారీ హైప్ ఏర్పడింది. విజయ్ అభిమానులు ఈ ప్రాజెక్ట్ ఆయన కెరీర్‌లో టర్నింగ్ పాయింట్ అవుతుందని నమ్ముతున్నారు.
గతంలో లైగర్, వరల్డ్ ఫేమస్ లవర్, ఫ్యామిలీ స్టార్ వంటి సినిమాలు నిరాశపరిచాయి. కింగ్డమ్ కూడా సరైన స్థాయి విజయం సాధించలేదు. కాబట్టి, ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ విజయ్‌ను మళ్లీ నిలబెడుతుందా అన్నది ఇప్పుడు కీలకం.
