
సినీ ఇండస్ట్రీలో బ్యాక్‌గ్రౌండ్ కేవలం ఎంట్రీ వరకు మాత్రమే ఉపయోగపడుతుందని, ఆ తర్వాత అసలు నిలబడేది టాలెంట్‌నేనని మంచు మనోజ్ స్పష్టం చేశారు. కష్టపడి, కంటెంట్‌తో పనిచేస్తే ఎవరైనా స్టార్‌గా ఎదగవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
తాజాగా మిరాయ్ విజయోత్సవంలో పాల్గొన్న మనోజ్, ఆ సినిమా తన కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచిందని తెలిపారు. ముఖ్యంగా తల్లి తనను హత్తుకుని అభినందించడం మిరాయ్ విజయానికి తానెప్పుడూ మరిచిపోలేని కాంప్లిమెంట్ అని చెప్పారు.
ఈ సందర్భంగా యూట్యూబర్‌గా ప్రారంభించి లిటిల్ హార్ట్స్తో విజయాన్ని అందుకున్న మౌళిని మనోజ్ ప్రశంసించారు. “స్టార్ కొడుకులే కావాలనేది కాదు, టాలెంట్ ఉంటే ఎవరైనా సక్సెస్ అవుతారు” అని వ్యాఖ్యానించారు.
మౌళికి మీడియా ముందు ప్రత్యేక ఆఫర్ ఇచ్చిన మనోజ్, “నీ సినిమాలో విలన్ క్యారెక్టర్ ఉంటే నేను తప్పకుండా చేస్తాను” అన్నారు. దీనితో సినీ వర్గాల్లో ఈ ఆఫర్ చర్చనీయాంశమైంది.
అలాగే, నిర్మాత టి.జి విశ్వప్రసాద్ గురించి ప్రశంసిస్తూ, “ఆయన లాంటి నిర్మాతను నేను చూడలేదు” అని తెలిపారు. ప్రభాస్ హీరోగా రాబోయే రాజాసాబ్ రికార్డులు తిరగరాస్తుందని అంచనా వేశారు.
తన తదుపరి ప్రాజెక్ట్‌గా డేవిడ్ రెడ్డి, ఆ తర్వాత అబ్రహాం లింకన్, రక్షక్ చిత్రాలు చేయనున్నట్లు కూడా మనోజ్ వెల్లడించారు.
