
సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం కూలీపై ప్రేక్షకుల్లో బిగ్ హైప్ నెలకొంది. యాక్షన్, మాస్ ఎలిమెంట్స్ తో దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. తొలి టీజర్ నుంచే సినిమాపై ఆసక్తి పెరిగింది. కథ, స్క్రీన్‌ప్లే విషయంలో కొత్తదనానికి పాటు, స్టార్ కాస్ట్ విషయంలోనూ భారీ లెవెల్‌లో ప్లాన్ చేశారు.
ఇక ఇప్పుడు ఈ సినిమా ప్రచార పంథాలోనూ స్పెషల్ టచ్ కనిపిస్తోంది. కోలీవుడ్ సమాచారం ప్రకారం, ‘కూలీ’ చిత్రం జైలర్ ప్రమోషన్ స్టైల్‌ను అనుసరిస్తోంది. జైలర్‌లో రజినీ మినహా ఇతర కాస్టింగ్‌ను రివీల్ చేయకుండా థియేటర్లలో సర్‌ప్రైజ్ ఇచ్చినట్టు, కూలీలోనూ అదే ట్రాక్‌ను ఫాలో అవుతోంది.
ఇప్పటివరకు విడుదలైన పోస్టర్, వీడియోల్లో రజినీకాంత్ పాత్రే హైలైట్ అవుతోంది కానీ, మిగిలిన స్టార్ కాస్టింగ్ ఎవరు? వారు ఎలాంటి పాత్రల్లో కనిపించబోతున్నారు? అనే దానిపై అధికారిక సమాచారం లేదు. ఈ విధానం సినిమా రిలీజ్ తర్వాత థియేటర్లలో ప్రేక్షకులకు పెద్ద షాక్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే అనిపిస్తోంది.
ఈ చిత్రంలో అనేక మంది ప్రముఖ నటులు భాగమవుతారని టాక్ ఉన్నా, ప్రొడక్షన్ హౌస్ అయిన సన్ పిక్చర్స్ అఫిషియల్‌గా ఎవరినీ కన్ఫర్మ్ చేయలేదు. ఈ రహస్యత మెయింటెన్ చేయడం వెనుక సూపర్ మాసివ్ సర్‌ప్రైజ్ ఉంటుందన్న నమ్మకంతో ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
ఇక ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్న అనిరుధ్ కూడా ట్రాక్‌లు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. టీజర్‌లో వినిపించిన బీజీఎం ఇప్పటికే ట్రెండ్ అవుతోంది. అనిరుధ్ మ్యూజిక్‌తో పాటు లోకేష్ మార్క్ యాక్షన్ మిక్స్ అయితే మాస్ ఫ్యాన్స్‌కు పండుగే.