
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి తెరకెక్కిస్తున్న చిత్రం రాజా సాబ్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాతో మళయాళ బ్యూటీ మాళవిక మోహనన్ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుండటంతో క్రేజ్ మరింత పెరిగింది. కథలో కామెడీ, రొమాన్స్, యాక్షన్ మాస్ ఆడియెన్స్‌కి పండుగలా ఉండబోతోంది.
మాళవిక పుట్టినరోజు సందర్భంగా మూవీ టీమ్ స్పెషల్ పోస్టర్ విడుదల చేసింది. ఇందులో ఆమె చీరకట్టులో ట్రెడిషనల్ గ్లామర్‌తో కనిపించి అభిమానులను ఆకట్టుకుంది. కాస్త వెయ్యిలుక్, చిరునవ్వుతో కనిపించిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “రాజా సాబ్” టీజర్‌లోనూ ఆమె లుక్‌కి విశేష స్పందన లభించింది.
ఈ సినిమా ద్వారా తెలుగులో పరిచయం అవుతుండటం మాళవికకు ప్రత్యేక అనుభూతి. తన తొలి తెలుగు చిత్రం ప్రభాస్‌తో కావడం అదృష్టంగా భావిస్తోందట. గతంలో మళయాళం, తమిళ సినిమాల్లో నటించి పేరు తెచ్చుకున్న ఆమెకు టాలీవుడ్‌కి మంచి బ్రేక్ అవుతుందని భావిస్తున్నారు.
ఈ సినిమాలో మాళవిక పాత్ర కీలకంగా ఉండబోతుందని సమాచారం. డైరెక్టర్ మారుతి హారర్ కామెడీ కథను మసాలా ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది. ఆమె నటనకు స్కోప్ ఉన్న రోల్ ఇచ్చారని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమా పాన్ ఇండియా లెవెల్‌లో రూపొందుతోంది. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాను ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
