ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో రాబోయే భారీ ప్రాజెక్ట్‌పై ఫిల్మ్ నగర్‌లో ఊహాగానాలు ఆగడం లేదు. ఈ సినిమా గురించి ఇప్పటికే పలు రకాల రూమర్స్ బయటకొచ్చాయి. తాజాగా, ఇందులో బన్నీకి సిస్టర్ రోల్ ఉంటుందని టాక్ వినిపిస్తోంది.
ఈ సిస్టర్ పాత్ర చాలా ఎమోషనల్‌గా, కథలో కీలకంగా ఉంటుందని అంటున్నారు. ఈ పాత్ర కోసం ఓ సీనియర్ హీరోయిన్‌ను ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నారని సమాచారం. అయితే, ఇది నిజమా కాదా అన్నది మేకర్స్ అధికారికంగా చెప్పాల్సి ఉంది.
ఇక బన్నీ పాత్రలో మూడు విభిన్న కోణాలు ఉంటాయని, వాటిలో ఒకటి నెగిటివ్ షేడ్ అని కూడా టాక్ నడుస్తోంది. దీంతో ఈ సినిమా క్యారెక్టర్ డిజైన్‌పై ఆసక్తి మరింత పెరిగింది.
అట్లీ ఈ ప్రాజెక్ట్ కోసం పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో, ఓ డాన్ చుట్టూ ఈ కథ సాగనుందని సమాచారం. అల్లు అర్జున్ ఇమేజ్‌కు తగ్గట్టుగా యాక్షన్, ఎమోషన్ ఉండబోతోందట.
సన్ పిక్చర్స్ ఈ ప్రాజెక్ట్‌ను భారీ బడ్జెట్‌తో నిర్మించబోతోంది. త్వరలోనే షూటింగ్ ప్రారంభించే ప్లాన్‌లో ఉన్నారు. అట్లీ ప్రత్యేకంగా కొన్ని గెస్ట్ రోల్స్ డిజైన్ చేస్తున్నాడట.
