Monday, May 18, 2026
HomeMovie Newsహృతిక్ - ఎన్టీఆర్ డాన్స్.. ఫ్యాన్స్‌కి ప్రోమో ట్రీట్

హృతిక్ – ఎన్టీఆర్ డాన్స్.. ఫ్యాన్స్‌కి ప్రోమో ట్రీట్

war-2-janab-e-aali-song-promo-hrithik-jr-ntr-fans-treat

YRF స్పై యూనివర్స్ లో భారీగా రూపొందుతున్న చిత్రం “వార్ 2” ఆగస్టు 14న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఇందులో హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తున్నారు. హీరోయిన్‌గా కియారా అద్వానీ ఎంపికయ్యారు. దర్శకుడు అయాన్ ముఖర్జీ ఈ చిత్రాన్ని హ్యాండిల్ చేస్తున్నారు.

ఈ సినిమా నుంచి అందరూ ఎదురుచూస్తున్న స్పెషల్ డాన్స్ సాంగ్ “జనాబ్-ఎ-ఆలీ/సలామ్ అనాలి” పాట ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. హృతిక్, ఎన్టీఆర్ ఇద్దరూ తమ డాన్స్ స్టెప్పులతో ఫ్యాన్స్‌కు కంటికి విందు అందించారు.

ఈ పాట కోసం ఫ్యాన్స్ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. పాటలోని ఎనర్జీ, గ్రేస్ తో ఇద్దరూ ప్రేక్షకులను అలరించారు. అయితే పూర్తి పాటను మాత్రం పెద్ద స్క్రీన్‌పై మాత్రమే చూడొచ్చునని మేకర్స్ పేర్కొన్నారు.

ప్రితమ్ సంగీతం అందించిన ఈ సినిమాలో, పాటకు హై స్టాండర్డ్ వీఏఫ్‌ఎక్స్‌, గొప్ప ప్రొడక్షన్ వాల్యూస్ పెట్టారు. హీరోల డ్యాన్స్ కాంబినేషన్ సినిమాకే స్పెషల్ హైలైట్‌గా నిలవనుంది.

వార్ 2 యాక్షన్, డాన్స్ మిక్స్‌తో వచ్చే మెగా మల్టీస్టారర్. హృతిక్ ఎన్టీఆర్ డాన్స్ ప్రోమోతో ప్రేక్షకుల్లో మరింత అంచనాలు పెరిగాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular