దర్శకధీరుడు రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న SSMB29పై రోజు రోజుకీ అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ సినిమాను హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కించేందుకు భారీ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
ఇప్పటికే కథా నిర్మాణం పూర్తయి, లొకేషన్లు ఖరారవుతున్నాయి. ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటించనున్న ఈ చిత్రం, ప్రపంచ ప్రాముఖ్యత కలిగిన అడ్వెంచర్ థ్రిల్లర్‌గా తెరకెక్కనుందని సమాచారం.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఇంటర్వెల్ సీక్వెన్స్ గురించి క్రేజీ గాసిప్ ఒకటి బయటకు వచ్చింది. కథ ప్రకారం ఓ భారీ లోయలో జరిగే అద్భుత యాక్షన్ ఎపిసోడ్ సినిమా హైలైట్ గా నిలవనుంది.
ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్ లో అద్భుతమైన విజువల్స్‌తో, మహేష్ బాబు పాల్గొనే ఛేజింగ్ సీన్ థియేటర్లలో ప్రేక్షకులకు ఊపిరి ఆడనివ్వదట. ఈ పార్ట్‌ను షూట్ చేయడానికి ఇప్పటికే ప్రత్యేకంగా లొకేషన్ హంట్ జరుగుతోందట.
ఈ సినిమా కథ గురించి రైటర్ విజయేంద్రప్రసాద్ గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. దక్షిణాఫ్రికా రచయిత విల్బర్ స్మిత్ పుస్తకాలను ఆధారంగా చేసుకుని స్క్రిప్ట్ రచించామని పేర్కొన్నారు. ఇది సినిమా ఒక ఇంటర్నేషనల్ అడ్వెంచర్ జర్నీ అని అర్థమవుతుంది. అంతర్జాతీయ స్థాయిలో ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోంది.
ప్రస్తుతం రాజమౌళి విదేశాల్లో షూటింగ్ లొకేషన్ల కోసం రీసెర్చ్ చేస్తున్నారు. లాంఛనంగా ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్‌పై మొదటి గ్లింప్స్ వచ్చేటప్పటికి ఆసియా నుంచి ప్రపంచ సినిమాకే షాక్ వచ్చేలా ఉండబోతోందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.
