
రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న SSMB29 సినిమా దేశవ్యాప్తంగా అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రాజెక్టుగా నిలిచింది. ఈ సినిమా రన్‌టైమ్‌పై ఓ సంచలన సమాచారం బయటకు వచ్చింది.
ఈ చిత్రం దాదాపు 200 నిమిషాల రన్‌టైమ్‌తో రూపొందనుందట. అంటే మూడు గంటల 20 నిమిషాల పొడవైన సినిమా ఇది కానుంది. గతంలో రాజమౌళి రూపొందించిన RRR కంటే కూడా ఇది ఎక్కువ రన్‌టైమ్ కలిగి ఉండటం విశేషం.
హైదరాబాద్‌లో షూటింగ్ జరగుతున్న ఈ ప్రాజెక్ట్‌కి జూలైలో కెన్యాలో జరగనున్న షెడ్యూల్ హైలైట్ కానుంది. అడవుల్లో తీసే యాక్షన్ సన్నివేశాలకు స్పెషల్ టీమ్‌ను సిద్ధం చేశారు.
ఇక రూ.50 కోట్లతో నిర్మిస్తున్న కాశీ సెట్స్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా మారుతున్నాయి. గ్రాఫిక్స్‌తో పాటు రియల్ లొకేషన్లలోనూ సినిమాను చిత్రీకరిస్తున్నారు.
ఇది కేవలం వినోదాత్మక చిత్రం కాదు, భారత సినిమా స్థాయిని పెంచే విధంగా తెరకెక్కనుందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ సినిమా 2026లో విడుదలయ్యే అవకాశం ఉండగా, ఫస్ట్ గ్లింప్స్ వచ్చే ఏడాది విడుదల కానున్నట్లు సమాచారం.
SSMB29, Mahesh Babu, Rajamouli, Runtime Update, Indian Cinema,
