
న్యూస్ డెస్క్: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై మూడు ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. ఇప్పటికే బీఆర్ఎస్ తమ అభ్యర్థిగా మాగంటి సునీతను ప్రకటించగా, కాంగ్రెస్ నాలుగు పేర్లతో అధిష్టానానికి నివేదిక పంపింది.
ఇప్పుడు బీజేపీ వంతు వచ్చింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, ముగ్గురి పేర్ల జాబితాను హైకమాండ్‌కి పంపించారు.
ముఖ్యంగా వీరిలో ముగ్గురూ అగ్రవర్ణాలకు చెందినవారే కావడం గమనార్హం. ఒకరు కమ్మ, ఇద్దరు రెడ్డి సామాజిక వర్గాల వారు.
వీరిలో లంకల దీపక్ రెడ్డి కిషన్ రెడ్డి సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. అలాగే వీరపనేని పద్మ, జూటూరు కీర్తి రెడ్డి పేర్లు కూడా టికెట్ రేసులో ఉన్నాయి.
బీఆర్ఎస్ మహిళా సెంటిమెంట్‌పై దృష్టి పెట్టగా, బీజేపీ కూడా అదే సెంటిమెంట్‌ను ఉపయోగించుకునే యోచనలో ఉంది.
కాబట్టి వీరపనేని పద్మ లేదా జూటూరు కీర్తి రెడ్డి టికెట్ దక్కే అవకాశాలు బలంగా వినిపిస్తున్నాయి. బీజేపీ ఈ ఉపఎన్నికను వ్యూహాత్మకంగా తీసుకొని జూబ్లీహిల్స్‌లో తమ బలం చూపించాలనే ఆలోచనలో ఉంది.