
న్యూస్ డెస్క్: టీమిండియా సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ భవిష్యత్తుపై చర్చలు వేడెక్కాయి. ముఖ్యంగా రోహిత్ కెప్టెన్సీ నుంచి తప్పించడంతో క్రికెట్ ప్రపంచంలో కొత్త ఊహాగానాలు మొదలయ్యాయి.
గిల్‌కి పగ్గాలు అప్పగించడాన్ని చాలామంది యువతకు అవకాశం ఇచ్చే నిర్ణయంగా స్వాగతిస్తే, అభిమానులు మాత్రం “రోహిత్‌కి ఇది రిటైర్మెంట్ సిగ్నల్ కాదా?” అంటూ ప్రశ్నిస్తున్నారు.
రోహిత్ కెప్టెన్సీలో భారత్ అనేక విజయాలు సాధించినా, వరల్డ్‌కప్ మాత్రం అందని కలగా మిగిలింది. 2023 ఫైనల్‌లో ఓటమి తర్వాత ఆయన మరో అవకాశం కోసం ప్రయత్నిస్తున్నాడని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. అయితే, గిల్‌కి బాధ్యతలు అప్పగించడంతో రోహిత్ భవిష్యత్తు అనిశ్చితంగా మారింది.
ఇర్ఫాన్ పఠాన్ వ్యాఖ్యలు ఈ చర్చను మరింత రగిలించాయి. “రోహిత్, కోహ్లీ 2027 వరల్డ్‌కప్ ఆడాలంటే నిరంతర ప్రాక్టీస్, ఫిట్‌నెస్ అవసరం.” అని ఆయన హెచ్చరించారు. దేశవాళీ క్రికెట్‌లో రోహిత్ మళ్లీ ఆడితేనే ఈ కల సాకారమవుతుందని సూచించారు.
ఇప్పుడు ప్రశ్న ఒకటే.. రోహిత్ మళ్లీ ప్రాక్టీస్‌లో దూకి వరల్డ్‌కప్ గెలుపు కలను కొనసాగిస్తాడా? లేక రిటైర్మెంట్ దిశగా అడుగులు వేస్తాడా? క్రికెట్ అభిమానులందరూ ఈ సమాధానం కోసం ఎదురు చూస్తున్నారు.
