
సినీ ప్రేక్షకుల కోసం అక్టోబర్ రెండో వారంలో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లపై బోలెడన్ని సినిమాలు, సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యాయి. థియేటర్లలో కొత్త రిలీజ్‌లు తక్కువగా ఉన్నా, హాట్‌స్టార్ నుంచి నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వరకు ప్రతీ ప్లాట్‌ఫామ్‌లో కొత్త కంటెంట్ అందుబాటులోకి రాబోతోంది.
జియో హాట్‌స్టార్‌లో హీరో తేజ సజ్జా నటించిన ‘మిరాయ్’ అక్టోబర్ 10 నుంచి స్ట్రీమింగ్ కానుంది. అదే రోజున ‘సెర్చ్: ది నైనా మర్డర్ కేస్’ సిరీస్ కూడా అందుబాటులోకి వస్తోంది.
నెట్‌ఫ్లిక్స్‌లో మాత్రం ‘స్విమ్ టు మీ’, ‘ది విమెన్ ఇన్ క్యాబిన్ 10’, అలాగే యానిమేషన్ సిరీస్ ‘కురుక్షేత్ర’ కూడా అక్టోబర్ 10 నుంచే రానున్నాయి.
అమెజాన్ ప్రైమ్ వీడియోలో అక్టోబర్ 8న ‘మెయింటెనెన్స్ రిక్వైర్డ్’ స్ట్రీమింగ్ మొదలవుతుంది.
మరోవైపు సన్‌నెక్స్ట్ లో ‘త్రిబాణధారి బార్బరిక్’, జీ5లో ‘స్థల్’ కూడా అక్టోబర్ 10న ప్రేక్షకులను పలకరించనున్నాయి.
ఇలా థ్రిల్లర్, హారర్, డ్రామా, యానిమేషన్, సస్పెన్స్ జానర్స్‌లో విభిన్న కంటెంట్‌తో ఈ వారం ఓటీటీల్లో పండగ వాతావరణం నెలకొంది.
