‘కల్కి 2898 ఏడి’లో దీపికా పదుకోన్ తప్పుకోవడంతో, ఆమె స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారో అన్న ఆసక్తి పెరిగింది. ఫ్యాన్స్‌లో పలు పేర్లు వినిపిస్తున్నప్పటికీ, దర్శకుడు నాగ్ అశ్విన్ మాత్రం ఒక కొత్త ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
తాజా సమాచారం ప్రకారం, ఆయన రుక్మిణీ వసంత్‌ను సీక్వెల్ హీరోయిన్‌గా తీసుకోవాలని భావిస్తున్నారట. ‘కాంతార: చాప్టర్ 1’లో తన సహజ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న రుక్మిణీ, నాగ్ అశ్విన్ దృష్టిలో పర్ఫెక్ట్ చాయిస్‌గా ఉన్నట్లు టాక్.
అయితే, అనుష్క, నయనతార, అలియా భట్ పేర్లు కూడా బలంగా వినిపిస్తున్నాయి. చివరకు ఎవరు ఫైనల్ అవుతారో చూడాలి. సీక్వెల్ టైటిల్‌ను ‘కర్ణ 3102 బీసీ’గా రిజిస్టర్ చేసినట్లు టాక్ ఉంది.
ఈ సీక్వెల్‌లో కర్ణుడి కథ, పురాణాల నేపథ్యం మరింత ప్రధానంగా ఉండనుందని సమాచారం. మొదటి భాగం ముగింపు కూడా కర్ణుడిపై ఆగడం వల్ల, సీక్వెల్ మొత్తం ఆ పాత్ర చుట్టూ తిరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
