
న్యూస్ డెస్క్: అమెరికా క్రికెట్ జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. దాదాపు 80 శాతం భారత సంతతి ఆటగాళ్లతో ముందుకు సాగుతున్న ఈ జట్టు సభ్యత్వాన్ని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) సస్పెండ్ చేసింది.
గతేడాది టి20 ప్రపంచకప్ సూపర్8 దశకు చేరి సంచలనం రేపిన అమెరికా, పాకిస్థాన్‌పై గెలుపు సాధించి ఇండియాను ఇబ్బంది పెట్టడం గుర్తుండే విషయమే. కానీ ఇప్పుడు ఐసీసీ నిర్ణయం వారిపై పెద్ద షాక్‌గా మారింది.
2028లో లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో క్రికెట్ మళ్లీ ప్రవేశిస్తోంది. 1900 తర్వాత తొలిసారిగా ఒలింపిక్స్‌లో క్రికెట్ ఆడనుండగా, ఆతిథ్య దేశం కావడంతో అమెరికా నేరుగా అర్హత పొందింది. అయితే ఈ సమయంలోనే ఐసీసీ సస్పెన్షన్ నిర్ణయం తీసుకోవడం మరింత చర్చనీయాంశమైంది.
యూఎస్ఏ క్రికెట్ బోర్డు ఐసీసీ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించలేదన్న ఆరోపణలతో ఈ చర్య తీసుకున్నారు. ముఖ్యంగా ఒలింపిక్ కమిటీ గుర్తింపు విషయంలో ఫలితాలు ఆశించిన మేరలో లేకపోవడం కూడా కారణమని తెలుస్తోంది.
ఇది తాత్కాలిక సస్పెన్షన్ మాత్రమేనని భావిస్తున్నారు. గతంలో శ్రీలంక క్రికెట్ బోర్డుపై కూడా ఇలాంటి చర్యలు తీసుకుని తరువాత పునరుద్ధరించడమే ఉదాహరణగా నిలిచింది.
ఐసీసీ స్పష్టంగా చెప్పినట్లుగా, అమెరికా క్రికెట్ భవిష్యత్ ఈ సమస్యను ఎప్పటికీ వాయిదా వేయకుండా త్వరగా పరిష్కరించడంపైనే ఆధారపడి ఉంది. ఒలింపిక్స్ సమీపిస్తున్న వేళ ఈ వివాదం తొందరగా సర్దుబాటు అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఏదేమైనా ఈ సస్పెన్షన్ అమెరికా క్రికెట్‌కు ఒక పెద్ద హెచ్చరిక. కానీ ఒకేసారి దిద్దుబాటు చేసుకునే అవకాశం కూడా అని చెప్పవచ్చు.