
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న ఓజీ మూవీపై భారీ హైప్ నడుస్తోంది. ట్రైలర్, పాటలతోనే క్రేజ్ మాస్ రేంజ్‌కి చేరింది. అయితే రిలీజ్‌కు గంటల ముందు ఊహించని అడ్డంకి ఎదురైంది. తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిన టికెట్ రేట్ల పెంపు, బెనిఫిట్ షోలపై స్టే విధించింది. దీంతో ఫ్యాన్స్‌లో నిరాశ నెలకొంది.
సుజీత్ డైరెక్షన్‌లో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాలో పవన్‌తో పాటు ప్రియాంక మోహన్, ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్, శ్రీయా రెడ్డి, ప్రకాష్ రాజ్ వంటి నటులు కనిపించబోతున్నారు. తమన్ మ్యూజిక్ అందించాడు.
టెలంగాణ ప్రభుత్వం ముందుగా నైజాం ఏరియాలో సింగిల్ స్క్రీన్లకు రూ.100, మల్టీప్లెక్సులకు రూ.150 అదనపు ఛార్జీలు అనుమతించింది. స్పెషల్ ప్రీమియర్స్ టికెట్ ధరను రూ.800గా ఫిక్స్ చేసింది. కానీ హైకోర్టు ఆ ఉత్తర్వులను రద్దు చేసింది.
ఇప్పటికే అమ్ముడైన ప్రీమియర్ టికెట్లకు రీఫండ్ ఇస్తారా, లేక మరో నిర్ణయం వస్తుందా అనే క్లారిటీ కోసం ఫ్యాన్స్ వేచి చూస్తున్నారు. దీనివల్ల నైజాంలో పరిస్థితి అనిశ్చితంగా మారింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం టికెట్ రేట్ల పెంపుకు, బెనిఫిట్ షోలకూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో అక్కడ అభిమానులు సంతోషంగా ఉన్నారు. తెలంగాణలో మాత్రం హైకోర్టు తీర్పు పెద్ద షాక్ అయ్యింది.
