
దక్షిణాదిలో స్టార్ హీరోయిన్‌గా ఎదుగుతున్న శ్రీలీల ఇప్పుడు బాలీవుడ్ వైపు దృష్టి సారించింది. ఆమె హిందీ డెబ్యూ మూవీగా కార్తీక్ ఆర్యన్‌తో కలిసి నటిస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ సినిమాకు అనురాగ్ బసు దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ చిత్రానికి మొదట ‘ఆషికి 3’ అని ప్రచారం జరిగినప్పటికీ, తాజా సమాచారం ప్రకారం “తు మెరి జిందగీ హై” అనే టైటిల్‌ను ఫైనల్ చేశారు.
టీ సిరీస్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఆషికి ఫ్రాంచైజీకి సంబంధించిన కాపీరైట్ సమస్యల కారణంగా టైటిల్ మార్చినట్లు తెలుస్తోంది. 2013లో విడుదలైన ‘ఆషికి 2’ బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో, కొత్త చిత్రానికి అదే పేరు వాడడం మేకర్స్ రిస్క్ చేయలేదట.
శ్రీలీల ఈ సినిమా కోసం పూర్తిగా తన లుక్, పెర్ఫార్మెన్స్ మార్చుకున్నట్లు సమాచారం. కార్తీక్ ఆర్యన్‌తో ఆమె కెమిస్ట్రీ సూపర్‌గా ఉందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ మూవీ రిలీజ్‌కి ముందే శ్రీలీల పేరు ముంబైలో హాట్ టాపిక్‌గా మారింది. ఇక సౌత్‌లో ఆమె నటించిన “మాస్ జాతర” ఈ నెల చివర్లో విడుదల కాబోతోంది.
