Thursday, September 3, 2026
HomeMovie Newsబిగ్ బాస్ కన్నడ హౌస్ సీజ్‌.. కంటెస్టెంట్స్‌ థియేటర్‌కి షిఫ్ట్‌!

బిగ్ బాస్ కన్నడ హౌస్ సీజ్‌.. కంటెస్టెంట్స్‌ థియేటర్‌కి షిఫ్ట్‌!

bigg-boss-kannada-house-seized-environment-case

బిగ్ బాస్‌ కన్నడ 12వ సీజన్‌ మధ్యలోనే ఊహించని ఘటన జరిగింది. కర్ణాటకలోని జాలీవుడ్‌ స్టూడియోలో ఉన్న బిగ్ బాస్‌ హౌస్‌ నుంచి వ్యర్థాలు పర్యావరణానికి హానికరం అవుతున్నాయని అధికారులు నోటీసులు ఇచ్చారు.

రెండు సార్లు హెచ్చరికలు జారీ చేసినా స్పందన లేకపోవడంతో చివరికి హౌస్‌ను సీజ్‌ చేశారు.

అధికారుల ఆదేశాలతో పోలీసులు సెట్‌లోకి వెళ్లి షూటింగ్‌ ఆపేశారు. కంటెస్టెంట్లను తాత్కాలికంగా సమీప థియేటర్‌లో ఉంచినట్లు సమాచారం. హౌస్‌ సీజ్‌ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

పర్యావరణ అనుమతులు తీసుకోకపోవడం, వ్యర్థాల నిర్వహణలో నిర్లక్ష్యం చూపడం కారణంగా ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ ఆదేశాలతో ఈ సీజ్‌ జరిగినట్లు టాక్‌.

స్టార్‌ కిచ్చ సుదీప్‌ హోస్ట్‌ చేస్తున్న ఈ షో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్‌ టాపిక్‌. బిగ్ బాస్‌ హిందీ లేదా తెలుగు సీజన్‌లలో ఇలాంటి ఘటనలు జరగకపోవడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular