
దక్షిణాది సినీ పరిశ్రమలో ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ కొత్త రూల్స్‌తో నిర్మాతలను టెన్షన్‌లోకి నెడుతున్నాయి. గతంలో భారీ రేట్లకు సినిమాలు కొనుగోలు చేసిన నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్‌లు ఇప్పుడు పెద్ద హీరోల సినిమాలకంటే చిన్న కంటెంట్ డ్రైవ్‌డ్ మూవీలపై ఫోకస్ చేస్తున్నారు.
ఇకపై అడ్వాన్స్ డీల్స్ లేవు. 2024 రేట్ల కంటే 50% తక్కువకే కొనుగోలు చేస్తామంటూ ఓటీటీ సంస్థలు స్పష్టం చేశాయి.
పెద్ద హీరోల సినిమాలు థియేటర్లలో ఫెయిల్ అయితే, భారీగా చెల్లించిన డబ్బు వృథా అవుతుందని భావిస్తున్నాయి. దీంతో నిర్మాతలకు బడ్జెట్ రికవరీ కష్టమవుతుంది.
కొత్త రూల్స్ ప్రకారం, ఓటీటీలో అమ్మడానికి ముందు 25 రోజుల బాక్సాఫీస్ కలెక్షన్ రిపోర్ట్ తప్పనిసరి. అంచనాలకు తగ్గ కలెక్షన్లు రాకపోతే డీల్ మొత్తాన్ని తగ్గించుకునే అధికారం ఓటీటీకి ఉంటుంది. పైగా, ఫుల్ పేమెంట్ కూడా 60 రోజుల తర్వాతే అందుతుంది.
ఇదంతా స్టార్ హీరోల పారితోషికంపై నేరుగా ప్రభావం చూపనుంది. ఇక నిర్మాతలు ఖర్చులు తగ్గించుకోవడమే మార్గమని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.
