సీనియర్ హీరో వెంకటేష్ తన తదుపరి సినిమాను త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయబోతున్నారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ బ్లాక్‌బస్టర్ తర్వాత ఆయన మరోసారి ఫ్యామిలీ ఎంటర్టైనర్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు.
ఈ సినిమా కోసం గురూజీ అనే పేరుతో ఫేమస్ అయిన త్రివిక్రమ్ ఓ ప్రత్యేకమైన ప్లాన్ రెడీ చేశారని తెలుస్తోంది.
ఈసారి తమన్ బదులు హర్షవర్ధన్ రామేశ్వర్‌ను మ్యూజిక్ డైరెక్టర్‌గా తీసుకున్నారు. ‘అర్జున్ రెడ్డి’ BGM, ‘యానిమల్’ సినిమాలతో తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్న హర్షవర్ధన్ ఈ ప్రాజెక్ట్ కోసం ఇప్పటికే రెండు ట్యూన్లు లాక్ చేసినట్లు సమాచారం.
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. కుటుంబ భావోద్వేగాలతో కూడిన క్లీన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు “అబ్బాయిగారు 60 ప్లస్” అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు.
వచ్చే సంవత్సరం సమ్మర్ రిలీజ్‌గా ప్లాన్ చేస్తున్న ఈ సినిమా వెంకటేష్ కెరీర్‌లో మరో మలుపుగా మారే అవకాశం ఉంది. గురూజీ వెంకీమామ కాంబో ఈసారి మాస్ రికార్డ్స్ బ్రేక్ చేసేలా కనిపిస్తోంది.
