డైరెక్టర్ పూరీ జగన్నాథ్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కాంబినేషన్‌లో రూపొందనున్న సినిమా సౌత్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ కాంబో కోసం పూరీ తన పాత ఎనర్జీతో తిరిగి రంగంలోకి దిగుతున్నాడని ఫ్యాన్స్ చెబుతున్నారు.
తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రానికి “స్లమ్ డాగ్” అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు టాక్.
ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా “యానిమల్” ఫేమ్ హర్షవర్ధన్ రామేశ్వర్‌ను ఎంపిక చేశారు. ఆయన బిజిఎం నేషనల్ అవార్డ్ విన్నర్ కావడంతో, ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు పెరిగాయి.
పూరీ గతంలో ఇచ్చిన మ్యూజిక్ ట్రీట్స్ గుర్తున్న ఫ్యాన్స్‌కు, హర్షవర్ధన్‌తో ఈసారి మ్యాజిక్ రిపీట్ అవుతుందా అన్నదే ఆసక్తి.
ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. పూరీ మళ్లీ ఫాంలోకి వస్తే, బాక్సాఫీస్ వద్ద మరోసారి తన మార్క్ చూపిస్తాడని సినీ వర్గాలు విశ్వసిస్తున్నాయి.
