
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ, నిర్మాతలు మాత్రం ఆయనను వదిలేలా లేరు. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం పవన్ సినిమాలపై మళ్లీ దృష్టి పెట్టబోతున్నారని తెలుస్తోంది.
‘OG’ సక్సెస్ మీట్లో పవన్ స్వయంగా “OG ఫ్రాంచైజ్ కొనసాగుతుంది” అని చెప్పడంతో, ఆయన సినిమాలకు గుడ్‌బై చెప్పే ఆలోచన లేదని స్పష్టమైంది.
ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న “ఉస్తాద్ భగత్ సింగ్” షూటింగ్ మళ్లీ ప్రారంభం కానుంది. అలాగే, రామ్ తాళ్లూరి నిర్మాణంలో ఒక కొత్త ప్రాజెక్ట్ కోసం వక్కంతం వంశీ, సురేందర్ రెడ్డి స్క్రిప్టులు సిద్ధం చేశారట.
ఇక దిల్ రాజు కూడా పవన్‌తో మళ్లీ సినిమా చేయాలనుకుంటున్నారు. ‘వకీల్ సాబ్’ తర్వాత ఈ కాంబినేషన్ మళ్లీ కలవనుందనే టాక్ ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించే అవకాశం ఉంది.
రాజకీయాలు, సినిమాలు రెండింటినీ సమాంతరంగా బ్యాలెన్స్ చేయాలనే పవన్ నిర్ణయంతో, నిర్మాతలు ఆయనపై మళ్లీ ఆశలు పెట్టుకున్నారు.
