
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా నటించిన మిరాయ్ ఓవర్సీస్ లో అద్భుతమైన ఫీట్ సాధించింది. ఫాంటసీ, మిస్టరీ, సూపర్ హీరో జోనర్ లో వచ్చిన ఈ సినిమా విదేశాల్లో రెండు రోజుల్లోనే మిలియన్ డాలర్ల క్లబ్ లోకి చేరింది. తేజ సజ్జా కెరీర్ లో ఇది రెండోసారి సాధించిన ఘనతగా నిలిచింది.
ఇప్పటికే హనుమాన్ తో మిలియన్ క్లబ్ లో అడుగుపెట్టిన తేజ సజ్జా, ఇప్పుడు మిరాయ్ తో మళ్లీ అదే ఫీట్ రిపీట్ చేశారు. అయితే ఈసారి రికార్డు సమయంలోనే మిలియన్ దాటడం ప్రత్యేకతగా మారింది. అమెరికాలో త్వరగానే బ్రేక్ ఈవెన్ చేరి కొత్త రికార్డ్ నెలకొల్పింది.
సినిమాకు వచ్చిన పాజిటివ్ టాక్, అద్భుతమైన రివ్యూలు కారణంగా ఇంకా ఎక్కువ వసూళ్లు సాధించే అవకాశముందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. విదేశాల్లో తెలుగు సినిమాకు ఇది కొత్త ప్రమాణాలను సెట్ చేస్తుందనేది వారి అభిప్రాయం.
మిరాయ్ ను కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేయగా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. రితికా నాయక్ హీరోయిన్ గా నటించగా, మంచు మనోజ్ విలన్ గా ఆకట్టుకున్నారు.
శ్రియా శరన్, జగపతిబాబు, జయరాం వంటి వారు కీలక పాత్రల్లో నటించారు. గౌర హరి సంగీతం సినిమాకు మరింత బలం చేకూర్చింది. గ్రాఫిక్స్, విజువల్స్, ప్రెజెంటేషన్ అన్నీ హై లెవెల్ లో ఉన్నాయని ప్రేక్షకులు పొగడ్తలు కురిపిస్తున్నారు.