
న్యూస్ డెస్క్: తెలంగాణ రాజకీయాల్లో అనేక రకాల మార్పులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. 2023 ఎన్నికల్లో ఆశలు పెట్టుకున్న కేసీఆర్ కి ప్రజలు బ్రేక్ వేశారు. రేవంత్ రెడ్డి సీఎం కుర్చీలో కూర్చోగా, బీఆర్ఎస్ విపక్షంలోకి వెళ్లింది. ఈ దెబ్బతో కేసీఆర్ ఎర్రవెల్లి ఫాం హౌస్‌లోనే ఎక్కువగా ఉంటూ, రాజకీయ రంగం నుంచి దూరమయ్యారు.
ఇంతలో కవిత అరెస్టు, కాళేశ్వరం ప్రాజెక్ట్ దర్యాప్తు, పార్టీ నేతల ద్రోహం.. అన్నీ కలిసి కేసీఆర్‌కు పెద్ద షాక్ ఇచ్చాయి. గ్రాఫ్ పెరగకపోగా, మరింత తగ్గిందని విశ్లేషణలు చెబుతున్నాయి.
మరోవైపు రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్‌పై వ్యంగ్యాలు విసురుతున్నారు. “ఫాం హౌస్‌లోనే నిర్బంధంలో ఉన్నారుగా, జైలుకి వేరే ఎందుకు?” అంటూ ఆయనపై సెటైర్లు పేల్చారు. ఈ వ్యాఖ్యలు పెద్ద చర్చనీయాంశమయ్యాయి.
కానీ బీఆర్ఎస్ క్యాడర్ మాత్రం కేసీఆర్ మళ్లీ రంగంలోకి రావాలని ఎదురుచూస్తోంది. ఆయన వస్తే ఆ కిక్కే వేరు అని భావిస్తున్నారు. తాజాగా కేటీఆర్ కూడా, “సరైన సమయంలోనే కేసీఆర్ జనాల్లోకి వస్తారు” అని క్లారిటీ ఇచ్చారు.
అంటే కాంగ్రెస్ పాలనపై యాంటీ ఇంకంబెన్సీ పెరిగినపుడు, కేసీఆర్ మళ్లీ ప్రజల మధ్యకి వచ్చి తన శక్తిని చాటుకుంటారని అనుకుంటున్నారు. ముఖ్యంగా 2026లో మరోసారి కారెక్కి బలంగా తిరిగి వచ్చే ప్రయత్నం చేస్తారని టాక్ ఉంది.
మొత్తానికి అపర చాణక్యుడి స్ట్రాటజీ ఓపిక. సరైన టైం వచ్చే వరకు ఫాం హౌస్‌లో తలదాచుకుని, తర్వాత మళ్లీ రంగంలోకి దిగి చెస్ బోర్డు తిప్పేస్తారన్నది ఆయన అభిమానుల నమ్మకం.
