Friday, May 1, 2026
HomeUncategorizedబిగ్ బాస్ 9 ట్విస్ట్: టాప్ 3లోకి దూసుకొస్తున్న డీమాన్

బిగ్ బాస్ 9 ట్విస్ట్: టాప్ 3లోకి దూసుకొస్తున్న డీమాన్

bigg-boss-9-demon-pawan-top-3-entry-grand-finale-voting-trends

బిగ్ బాస్ సీజన్ 9 క్లైమాక్స్‌కు వచ్చేసరికి లెక్కలన్నీ మారిపోతున్నాయి. మొన్నటి వరకు టాప్ 5లో ఉంటాడా లేదా అనే అనుమానాలను పటాపంచలు చేస్తూ, ‘డీమాన్’ పవన్ అనూహ్యంగా పుంజుకున్నాడు.

ముఖ్యంగా రెండు వారాల క్రితం రీతు ఎలిమినేట్ అయిన తర్వాత పవన్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. అప్పటివరకు ఆమె నీడలో ఉండిపోయిన పవన్, ఇప్పుడు తనలోని అసలైన ఆటగాడిని బయటకు తీశాడు.

ఈ వారం జరుగుతున్న ‘రీవైండ్’ టాస్కుల్లో పవన్ చూపించిన దూకుడు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తోంది. ఒకప్పుడు టాప్ 5లో చివరి స్థానానికి పరిమితమవుతాడని భావించిన వారు కూడా ఇప్పుడు అతనికి ఓట్లు వేస్తున్నారు.

తాజా ఓటింగ్ ట్రెండ్స్ ప్రకారం, పవన్ ఇప్పుడు ఇమ్మాన్యుయెల్‌కు గట్టి పోటీ ఇస్తూ టాప్ 3 రేసులో దూసుకుపోతున్నాడు. కళ్యాణ్, తనూజ టాప్ 2లో కొనసాగుతుండగా, మూడో స్థానం కోసం జరుగుతున్న పోరు ఆసక్తికరంగా మారింది.

‘అగ్నిపరీక్ష’ ద్వారా హౌస్‌లోకి వచ్చిన పవన్, ఇన్నాళ్లు రీతుకు సపోర్ట్ సిస్టమ్‌గా ఉండిపోయి వెనుకబడ్డాడు. ఆమె వెళ్ళిపోయాక చాలా ఫ్రీగా, ఎగ్రెసివ్‌గా ఆడుతున్నాడు. తోటి కంటెస్టెంట్లతో కలిసిపోతూనే, టాస్కుల్లో తన మార్కు చూపిస్తున్నాడు. “ఇదే ఆట ముందు నుంచి ఆడి ఉంటే కచ్చితంగా విన్నర్ రేసులో టాప్ 2లో ఉండేవాడు” అని ఆడియన్స్ అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుతం కామనర్ కోటాలో వచ్చిన కళ్యాణ్ టాప్ ప్లేస్‌లో ఉండగా, పవన్ కూడా అదే స్థాయిలో ఓటింగ్ సాధిస్తే.. ఆదివారం జరిగే గ్రాండ్ ఫినాలేలో ఊహించని ఫలితం వచ్చే అవకాశం ఉంది. మరి డీమాన్ పవన్ టాప్ 3తో సరిపెట్టుకుంటాడా లేక విన్నర్ ట్రోఫీ దాకా వెళ్తాడా అనేది ఈ వీకెండ్ తేలిపోనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular